విజయనగరం, న్యూస్‌లైన్ : అంగన్‌వాడీ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థుల దరఖాస్తులను బుధవా రం పరిశీలించారు. విశాఖలోని ఓల్డ్ సీబీఐ జం క్షన్ రోడ్డులోని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశా ఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుల కార్యాల యంలో జరిగిన ఈ ప్రక్రియకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి అర్హత సాధించిన అభ్యర్థులు హాజరయ్యారు. విశాఖపట్నం జోన్ పరిధిలో189 సూపర్‌వైజర్ పోస్టులకు, 48 కాంట్రాక్ట్ సూపర్‌వైజర్లను రెగ్యులర్ చేసేందుకు అక్టోబర్ 27న రాత పరీక్ష నిర్వహించారు. 189 పోస్టులకు 187 మంది ఎంపికయ్యారు.
వికలాంగులకు కేటయించిన రెండు పోస్టులకు అర్హులైన వారు లేకపోవడంతో వాటిని భర్తీ చేయలేదు. అలాగే 48 మంది కాం ట్రాక్ట్ సూపర్‌వైజర్లను రెగ్యులర్ చేసేందుకు పరీక్ష నిర్వహించినా వారెవరూ అర్హత సాధించలేదు. ఉత్తీర్ణులైన అభ్యర్థుల కౌన్సెలింగ్‌ను కూ డా బుధవారమే నిర్వహించారు. అభ్యర్థుల వివ రాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని మ హిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ ప్రాంతీయ సం యుక్త సంచాలకురాలు అనసూయ తెలిపారు.