
సాక్షి, విజయవాడ : రోజురోజుకు పెరుగుతున్న డీజల్ ధరలతో ఆర్టీసీ నష్టపోతుందని ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వై వీ రావు, ఇన్చార్జి ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న డీజల్ ధరల వలన ఆర్టీసీపై ఏడాదికి సుమారు 300కోట్ల రూపాయలు భారం పడుతుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్లనే ఆర్టీసీ నష్టపోతోందని ఆరోపించారు.
డీజల్ ధరలు తగ్గించాలని, లేదంటే పెరుగుతున్న డీజల్ ధరల వలన ఆర్టీసీపై పడుతున్న ఆర్థిక భారాన్ని పూర్తిగా ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నెల 10న రాష్ట్రవ్యాప్తంగా 128 డిపోలలో, వర్కుషాపుల వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment