హన్మకొండ సిటీ, న్యూస్‌లైన్ : తెలంగాణలో ఏ ఒక్క భాగం లేదా ప్రాంతాన్ని వదులుకునేది లేదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్ష మేరకు సంపూర్ణ తెలంగాణ ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు. సంపూర్ణ తెలంగాణ ఏర్పాటుచేయాలనే డిమాండ్‌తో తెలంగాణ లెక్చరర్స్ ఫోరం(టీఎల్‌ఎఫ్) జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం హన్మకొండలోని కాళోజీ విగ్రహం వద్ద ఒక రోజు దీక్ష చేశారు.
దీక్షలను రిటైర్డ్ అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షుడు పులి సారంగపాణి ప్రారంభించగా వినయ్‌భాస్కర్ సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఆంక్షలు లేని తెలంగాణ కావాలన్నదే ఇక్కడి ప్రజల ఆకాంక్ష అని తెలిపారు. భద్రాచలంను విడదీయాలని కానీ మరో నిర్ణయం కానీ తీసుకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించా రు. అలాగే, హైదరాబాద్‌పై కూడా ఎలాంటి ఆంక్షలు పెట్టొద్దని ఆయన డిమాండ్ చేశారు.
విభజనలో అన్యాయం చేయొద్దు..
టీఎల్‌ఎఫ్ రాష్ర్ట వర్కింగ్ ప్రెసిడెంట్ పులి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర విభజనలో అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని అన్నారు. జెడ్పీ మాజీ చైర్మన్ సాం బారి సమ్మారావు మాట్లాడుతూ ఈ నెలఖారులోగా రాష్ట్ర పునర్విభజన జరుగుతుందని ధీమా వ్యక్తం చేశా రు. దీక్షల్లో టీఎల్‌ఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిరంజీవి, భీమినేని శ్రీనివాస్, జిల్లా ఆర్గనైజిం గ్ సెక్రటరీ పొక్కుల సదానందంతో పాటు డాక్టర్ బొడ్డు రమేష్, పిట్ట వేణుమాధవ్, బ్రహ్మం, సదానందం, విజ య్‌కుమార్, బుర్ర గోవర్ధన్, శ్యాంయాదవ్, అస్నాల శ్రీనివాస్ దీక్షలో కూర్చోగా.. సంఘీభావం తెలిపిన వా రిలో టీఆర్‌ఎస్ నాయకులు కొరబోయిన సాంబయ్య, కె.వాసుదేవరెడ్డి తదితరులు ఉన్నారు.
సంపూర్ణ తెలంగాణ ఇవ్వాల్సిందే..
Published Mon, Feb 10 2014 4:05 AM | Last Updated on Tue, Mar 19 2019 7:00 PM
Advertisement
Advertisement