నిత్యం వంచనతోనే పాలన | BC Sub plan in somewhere | Sakshi
Sakshi News home page

నిత్యం వంచనతోనే పాలన

Published Sun, Mar 6 2016 4:44 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

నిత్యం వంచనతోనే పాలన - Sakshi

నిత్యం వంచనతోనే పాలన

బీసీ సబ్‌ప్లాన్ ఎక్కడా?
వ్యతిరేకత రావడంతోనే కుతంత్ర రాజకీయూలకు తెరదీశారు
ముఖ్యమంత్రిపై ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడుముత్తుముల అశోక్‌రెడ్డి
 

 
 బేస్తవారిపేట: ఎన్నికల హామీలను తుంగలో తొక్కుతూ నిత్యం దగా, మోసం వంచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన కొనసాగుతోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని చెట్టిచర్ల, జేబీకేపురం గ్రామాల్లో శనివారం పల్లెపల్లెకు వైఎస్సార్‌సీపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.. మూడో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు మరి బీసీ సబ్‌ప్లాన్ ఎక్కడా అని ప్రశ్నించారు. అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో ముఖ్యమంత్రి కుతంత్ర రాజకీయూలకు తెరదీశారని, కోట్లు కుమ్మరించి నిస్సిగ్గుగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొంటున్నారని విమర్శించారు.

వైఎస్సార్‌కు మంచి మనసుంది కాబట్టే ఆయన మరణించి ఆరేళ్లరుునా పేదల గుండెల్లో చిరస్థారుుగా నిలిచారన్నారు. కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన మహానేత వైఎస్సార్ అని కొనియూడారు. గ్రామాల్లో ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. ఎంపీపీలు ఓసూరారెడ్డి, వంశీధరరెడ్డి,  రవికుమార్, కాశిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు ఐజయ్య, మండల ఉపాధ్యక్షుడు  రంగయ్య, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ బాలిరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు గాలిరెడ్డి, ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు కేశవరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement