సీమాంధ్రలో బీజేపీ కార్యాలయాలపై, నాయకులపై సమైక్యవాదులు చేస్తున్న దాడులకు నిరసనగా సోమవారం మందమర్రిలో స్థానిక బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు.
బీజేపీ నాయకులపై దాడికి నిరసన
Aug 6 2013 4:21 AM | Updated on Mar 28 2019 8:37 PM
మందమర్రి రూరల్, న్యూస్‌లైన్ : సీమాంధ్రలో బీజేపీ కార్యాలయాలపై, నాయకులపై సమైక్యవాదులు చేస్తున్న దాడులకు నిరసనగా సోమవారం మందమర్రిలో స్థానిక బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. పాత బస్‌స్టాండ్ వద్ద రాష్ట్రీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సీమాంధ్ర నాయకులు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు మేకల రమేశ్, సీనియర్ నాయకుడు దీక్షితులు మాట్లాడుతూ, బీజేపీ ఒత్తిడి కారణంగానే తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించవలసి వచ్చిందని తెలిపారు.
తమ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రకటిస్తుందని భావించి అంతకుముందే ఇచ్చి తెలంగాణ ప్రజల అభిమానాన్ని పొందాలని భావించిందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా అవినీతితో కూరుకుపోయాయని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. ప్రధానమంత్రిగా మోడి పగ్గాలు చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నాయకులు తళ్లపల్లి తిరుపతి గౌడ్, రాంటెక్కి దుర్గరాజ్, దాగం ఆనంద్, సప్పిడి శ్రీనివాస్, మురిమురి రమేశ్, ఎర్రోజు శ్రీనివాస్, అల్లం నగేశ్, సప్పిడి సురేశ్, యాకూబ్, ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement