ప్రాణం మీదికి తెచ్చిన ప్రయోగం | Brought to life in an experiment aboard | Sakshi
Sakshi News home page

ప్రాణం మీదికి తెచ్చిన ప్రయోగం

Published Sat, Feb 1 2014 2:47 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

ప్రాణం మీదికి తెచ్చిన ప్రయోగం - Sakshi

ప్రాణం మీదికి తెచ్చిన ప్రయోగం

  •     తరగతి గదిలో పేలిన డిటోనేటర్
  •      ముగ్గురు విద్యార్థులకు గాయాలు
  •      ఒకరి పరిస్థితి విషమం
  •      ఇబ్రహీంపూర్ హైస్కూల్‌లో ఘటన
  •  రఘునాథపల్లి, న్యూస్‌లైన్ : రోడ్డుపై దొరికిన డిటోనేటర్‌తో సరదాగా చేసిన ప్రయోగం ఓ విద్యార్థి ప్రాణం మీదకు వచ్చింది. రిమోట్ కారును మొబైల్ బ్యాటరీతో నడిపిన ఆ విద్యార్థి అదే తరహాలో చేసిన ప్రయోగం వికటించింది. సెలఫోన్ బ్యాటరీకి డిటోనేటర్ వైరును అనుసంధానం చేయడంతో అది పేలి ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. ప్రయోగం చేసిన విద్యార్థి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ ఘటన మండలంలోని ఇబ్రహీంపూర్ హైస్కూల్‌లో శుక్రవారం  జరిగింది. వివరాలిలా ఉన్నాయి. ఇబ్రహీంపూర్ హైస్కూల్‌లో అదే గ్రామానికి చెందిన సర్జన మల్లేష్, రమ దంపతుల కుమారుడు నరేష్(11) ఆరో తరగతి చదువుతున్నాడు.

    రోజులాగే శుక్రవారం తోటి విద్యార్థులతో కలిసి పాఠశాలకు వెళుతున్న నరేష్‌కు రోడ్డుపై డిటోనేటర్ కనిపించింది. దానిని అతడు బ్యాగులో వేసుకుని పాఠశాలకు చేరుకున్నాడు. అప్పటికే తన బ్యాగులోని రిమోట్‌కారును మొబైల్ బ్యాటరీతో అనుసంధానం చేసి విద్యార్థులతో కలిసి ఆడాడు. క్లాస్ టీచర్ సిద్దులు రావడంతో విద్యార్థులు ఎవరి సీట్లలో వారు కూర్చున్నారు. వెనక బెంచీలో కూర్చున్న నరేష్ డిటోనేటర్ తీసి బ్యాగులో బ్యాటరీకి అనుసంధానం చేశాడు. బ్యాటరీ నుంచి వచ్చిన శక్తికి డిటోనేటర్ పెద్దపెట్టున పేలింది. దీంతో పక్కన ఉన్న విద్యార్థులు బండ్ర క్రాంతికుమార్, పబ్బ అజయ్‌కుమార్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

    పేలుడుతో విద్యార్థులు అరుస్తూ  బయటకు పరుగులు పెట్టారు. భయూందోళనకు గురైన ఉపాధ్యాయులు కొద్దిసేపట్లో తేరుకుని సంఘటన స్థలానికి చేరుకోగా నరేష్ చేతి వేళ్లు నుజ్జునుజ్జరుు విలవిలలాడుతూ కనిపించాడు. తీవ్ర రక్తస్రావమవుతుండడంతో వెంటనే జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స తర్వాత మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. పేలుడు శబ్దం విని గ్రామస్తులు పెద్దఎత్తున పాఠశాలకు చేరుకున్నారు.
     
    ఎక్కడిది ఈ డిటోనేటర్..
     
    పేలుళ్లకు ఉపయోగించే డిటోనేటర్ విద్యార్థికి ఎక్కడి నుంచి వచ్చింది.. గ్రామంలో రోడ్డుపై దానిని ఎవరు పడేశారు.. ప్రమాదమని తెలిసి కూడా ఎందుకు నిర్లక్ష్యం చేశారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గ్రామశివారులోని గుట్టపై బండలను పగులకొట్టేందుకు క్రషర్ యజమా ని డిటోనేటర్లను తరలిస్తుండగా రోడ్డుపైపడి ఉంటుందని గ్రామస్తులు పేర్కొం టున్నారు. పేలుడుకు అభంశుభం తెలియని  విద్యార్థి పరిస్థితి విషమంగా మా రిందని, డిటోనోటర్‌ను నిర్లక్ష్యంగా పడేసిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, క్రషర్‌ను రద్దుచేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.  
     
    వరుస పేలుళ్లతో ఆందోళన
     
    మండలంలోని గోవర్ధనగిరి క్రషర్ వద్ద జనవరి 3న జిలెటెన్ స్టిక్స్ పేలి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ముగ్గురు కూలీలు తీవ్ర గాయాలపాలైన విషయం తెలిసిందే. నెల రోజులు గడవక ముందే ఇబ్రహీంపూర్‌లో డిటోనేటర్ పేలడం గ్రామస్తులను భయూందోళనకు గురిచేసింది. ఇలా క్రషర్ల కారణంగా వరుస పేలుళ్లు జరుగుతున్నా పోలీసులు మెతక వైఖరి ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వె లువెత్తుతున్నాయి.
     
    ఎంపీ రాజయ్య పరామర్శ

     కాగా పేలుడు జరిగిన విషయాన్ని తెలుసుకు న్న ఎంపీ సిరిసిల్ల రాజయ్య, కాంగ్రెస్ నాయకులు రాజారపు ప్రతాప్, లింగాల జగదీష్‌చందర్‌రెడ్డి, కాసర్ల నర్సమ్మ పాఠశాలకు చేరుకుని వివరాలు హెచ్‌ఎం సత్తిరెడ్డిని అడిగి తెలుసుకున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement