నిర్మాత పరుచూరి ప్రసాద్‌పై కేసు నమోదు | Case filed on Producer Paruchuri Prasad | Sakshi
Sakshi News home page

నిర్మాత పరుచూరి ప్రసాద్‌పై కేసు నమోదు

Published Tue, Aug 6 2013 12:22 AM | Last Updated on Fri, Sep 1 2017 9:40 PM

Case filed on Producer Paruchuri Prasad

హైదరాబాద్: బుల్లితెర నటి పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలపై నిర్మాత పరుచూరి ప్రసాద్‌పై బంజారాహిల్స్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. బేగంపేటకు చెందిన బి.మాధవి (36) బుల్లితెర నటి. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆదివారం రాత్రి గం.10 సమయంలో ఆమె మరికొందరితో కలిసి సంగీత దర్శకుడు చక్రి నివాసానికి విందు నిమిత్తం వెళ్లారు. ఇదే కార్యక్రమానికి వచ్చిన పరుచూరి ప్రసాద్ రాత్రి 12 గంటల సమయంలో మాధవితో అనుచితంగా ప్రవర్తించారు. దీంతో తన ఇంట్లో గలభా చేయవద్దంటూ వారిని చక్రి బయటకు పంపేశారు. అక్కడ నుంచి బయటకు వచ్చిన మాధవి, ప్రసాద్‌లు రోడ్డుపైనా ఘర్షణ పడ్డారు. ఈ నేపథ్యంలోనే ప్రసాద్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని మాధవి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి పోలీసులు ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement