
సాక్షి, అమరావతి: ర్యాపిడ్ టెస్ట్ కిట్లను దేశ వ్యాప్తంగా రెండు రోజుల పాటు ఆపాలని కేంద్ర ప్రభుత్వం సూచించినట్లు రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ మంగళవారం తెలిపారు. ఐసీఎంఆర్ (భారతీయ వైద్య పరిశోధన మండలి) మార్గదర్శకాల మేరకు రెండు రోజులు ఆపుతున్నామని, తిరిగి వారు విడుదల చేసే మార్గదర్శకాల మేరకు వాటిని ఉపయోగిస్తామని ఆయన వివరించారు. కాగా, ర్యాపిడ్ టెస్ట్ కిట్ల కొనుగోలుకు వివిధ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వమే అనుమతించిన విషయం తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఈ కిట్లను ఇంకా పరీక్షలకు ఉపయోగించ లేదు. ఇతర పద్ధతుల ద్వారానే కోవిడ్–19 పరీక్షలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.