నోట్ల రద్దు కష్టాలు తాత్కాలికమే! | Central Vigilance Commissioner KV Chaudhary comments on demonisation | Sakshi
Sakshi News home page

నోట్ల రద్దు కష్టాలు తాత్కాలికమే!

Published Sun, Dec 18 2016 2:06 AM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM

నోట్ల రద్దు కష్టాలు తాత్కాలికమే! - Sakshi

నోట్ల రద్దు కష్టాలు తాత్కాలికమే!

కేంద్ర విజిలెన్స్‌ కమిషనర్‌ కేవీ చౌదరి

తిరుచానూరు : నోట్ల రద్దు కష్టాలు తాత్కాలికమేనని, మరికొన్ని రోజుల్లో అన్నీ సర్దుకుంటాయని కేంద్ర విజిలెన్స్‌ కమిషనర్‌(సీవీసీ) కేవీ చౌదరి అన్నారు. తిరుపతి పర్యటనలో భాగంగా శనివారం ఆయన కుటుంబ సమేతంగా తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్నారు.

ఆయనకు ఆలయ పేష్కార్‌ రాధాకృష్ణ, సూపరింటెండెంట్‌ మాధవకుమార్‌లు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. నోట్ల రద్దుతో దేశంలో అవినీతి, అరాచకం, ఉగ్రవాదం అంతమొందుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement