సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కె.వి.చౌదరి
పామర్రు: కమీషన్లు ఇచ్చి అక్రమంగా జన్‌ధన్ ఖాతాల్లో నగదు వేసుకున్న వారి వివరాలను ఆదాయ పన్ను, అవినీతి నిరోధక శాఖల ద్వారా పరిశీలిస్తున్నట్లు సెంట్రల్ విజిలెన్‌స కమిషనర్ కొసరాజు వీరయ్య చౌదరి తెలిపారు. ఏపీలోని కృష్ణాజిల్లా పామర్రులో ఆయన శనివారం ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పది నోట్లలో ఒక నకిలీ నోటు చెలామణి అవుతోందన్నారు.
అలాగే పెద్ద నోట్లతో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని.. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా పెద్ద నోట్లు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. దీని వల్ల రైతులతో పాటు లీగల్‌గా సంపాదించుకున్న వారు కొంత ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనని చెప్పారు. కార్యక్రమంలో ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు, గ్రామ సర్పంచ్ కొసరాజు స్వప్న, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
జన్‌ధన్ ఖాతాల పై దృష్టి సారించాం
Published Sun, Dec 4 2016 4:12 AM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM
Advertisement