ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం పట్టిసీమ ఎత్తిపోతల పనులను పరిశీలించారు. పశ్చిమ గోదావరి జిల్లా ..
ఏలూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం పట్టిసీమ ఎత్తిపోతల పనులను పరిశీలించారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన పోలవరం ప్రాజెక్ట్ పనుల తీరును కూడా పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. రెండు వారాలుగా ఓటుకు నోటు వివాదంలో పీకలోతు కూరుకుపోయిన చంద్రబాబు అనూహ్యంగా గురువారం జిల్లాకు రానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
నెలరోజుల క్రితమే చంద్రబాబు పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులను పరిశీలించి.. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో బస చేసిన విషయం తెలిసిందే. పట్టిసీమ కాంట్రాక్ట్‌లో మిగిలిన అవినీతి సొమ్ముతోనే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించారని విపక్షాలు ఆరోపించగా, ఇదే సమయంలో సీఎం అదే పట్టిసీమకు రావడం చర్చనీయాంశమైంది.