చంద్రబాబుపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి | Chief Minister N Chandrababu Naidu Atrasiti case | Sakshi
Sakshi News home page

చంద్రబాబుపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

Published Sun, Feb 21 2016 3:04 AM | Last Updated on Mon, Aug 13 2018 3:58 PM

చంద్రబాబుపై  అట్రాసిటీ కేసు నమోదు చేయాలి - Sakshi

చంద్రబాబుపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) : దళితుల మనోభావాలను కించపరుస్తూ మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఇటీవల దళితులను కించపరిచేలా సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా శనివారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. బుచ్చిరెడ్డిపాళెంలో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబునాయుడు కులరాజకీయాలు మానుకోవాలన్నారు. గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం చింతవరంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ మాట్లాడుతూ సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి దళితుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం సరికాదన్నారు.

ఆత్మకూరు నియోజకవర్గంలో జరిగిన నిరసన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీ, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొండా వెంకటేశ్వర్లు, వైఎస్సార్‌సీపీ ఫ్లోర్ లీడర్ అల్లారెడ్డి ఆనందరెడ్డి బాబు వ్యాఖ్యలను ఖండించారు. వెంకటగిరి క్రాస్‌రోడ్డులో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా సహాయ కార్యదర్శి చిట్టేటి హరికృష్ణ మాట్లాడుతూ జెడ్పీ చైర్మన్, వెంకటగిరి సమన్వయకర్త  బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి నేతృత్వంలో నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు.

సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట పాత బస్టాండు వద్ద జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ సుబ్రమణ్యంరెడ్డి మాట్లాడారు. కావలిలో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి పందిటి కామరాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. బిట్రగుంటలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ పెంచలయ్య మాట్లాడుతూ దళితజాతిలో పుట్టాలని ఎవరు కోరుకుంటారు అంటూ సీఎం చేసిన వాఖ్యలను ఖండించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement