బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో దిగ్విజయ్ సింగ్పై ఫిర్యాదు | Complaint against Digvijay Singh for using red beacon on vehicle | Sakshi
Sakshi News home page

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో దిగ్విజయ్ సింగ్పై ఫిర్యాదు

Published Fri, Dec 13 2013 10:48 PM | Last Updated on Tue, Aug 14 2018 3:55 PM

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో దిగ్విజయ్ సింగ్పై ఫిర్యాదు - Sakshi

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో దిగ్విజయ్ సింగ్పై ఫిర్యాదు

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్పై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సుప్రీం కోర్టు తీర్పును విరుద్ధంగా దిగ్విజయ్ ఎర్ర బుగ్గ కారులో ప్రయాణించినందుకు తెలుగు యువత నాయకులు ఆయనపై ఫిర్యాదు చేశారు. నగర పర్యటనకు వచ్చిన దిగ్విజయ్ ఎర్ర బుగ్గ కారు వాడారని ఆరోపించారు.

కాగా దిగ్విజయ్పై కేసు నమోదు చేయలేదని, ఈ విషయాన్ని విచారిస్తున్నామని బంజారాహిల్స్ పోలీసులు చెప్పారు. ఈ విషయంపై డిగ్గీరాజా మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారుల్ని అడగాలన్నారు. రాజ్యాంగబద్ధమైన పోస్టుల్లో ఉన్నవారు, అత్యున్నత పదవుల్లో ఉన్నవారు మాత్రమే ఎర్రబుగ్గ కార్లను వాడాలని సుప్రీం కోర్టు ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. ఎలాంటి అధికారు పదవుల్లో లేని  దిగ్విజయ్ ఎర్రబుగ్గ కారు వాడటం వివాదాస్పదమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement