కాంగ్రెస్‌, టీడీపీల డ్రామా: భూమా | congress-tdp play double game, says bhuma nagireddy | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌, టీడీపీల డ్రామా: భూమా

Published Sat, Sep 28 2013 10:57 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్‌, టీడీపీల డ్రామా: భూమా - Sakshi

కాంగ్రెస్‌, టీడీపీల డ్రామా: భూమా

కర్నూలు: రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్‌, టీడీపీలు డ్రామాలు ఆడుతున్నాయని వైఎస్సార్సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి ఆరోపించారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా తమ పార్టీ కేంద్రప్రభుత్వానికి సమైక్యవాణి వినిపిస్తోందన్నారు. రాష్ట్రంలో సమైక్యవాదానికి కట్టుబడి ఉన్న ఏకైకపార్టీ వైఎస్సార్‌సీపీ అని చెప్పారు. ఇప్పటికైనా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన వైఖరి మార్చుకోవాలని సూచించారు. వైఎస్‌ కుటుంబంపై నిరంతరం విషం కక్కడం మానుకుని, సమైక్యబాట పట్టాలని పిలుపునిచ్చారు.

 

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహారం చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన నిర్ణయం వెలువడిన వెంటనే.. ఆయన రాజీనామా చేసి ఉంటే ఈరోజు ఇలా మాట్లాడాల్సి అవసరం ఉండేది కాదన్నారు. ఎన్ని ఎత్తులు వేసినా, కుట్రలు పన్నినా.. టీడీపీ, కాంగ్రెస్‌లను ప్రజలు నమ్మే స్థితిలో లేరని భూమా పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement