ఆరోగ్య శాఖకు అవినీతి జబ్బు | corruption health department in Eluru | Sakshi
Sakshi News home page

ఆరోగ్య శాఖకు అవినీతి జబ్బు

Published Thu, Sep 25 2014 1:12 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

corruption health department in Eluru

 ఏలూరు :జిల్లా వైద్య, ఆరోగ్య శాఖకు అవినీతి జబ్బు పట్టుకుంది. ఉద్యోగుల బదిలీ కౌన్సెలింగ్, డీఈసీ మాత్రల పంపిణీ వంటి సందర్భాల్లో ప్రతిసారి వార్తలకు ఎక్కుతున్న ఈ శాఖను తాజాగా బదిలీల వ్యవహారం కుదిపేస్తోంది. ఈసారి కూడా డీఎంహెచ్‌వో కార్యాలయ ఉగ్యోగులు కొం దరు పాత పద్ధతులను అవలంభిస్తూ అక్రమాలకు తెరలేపా రు. ఇటీవల డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి వివిధ పీహెచ్‌సీలకు పంపించిన సర్వీసు సీనియార్టీ జాబితాలు ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. వీటి ఆధారంగానే బదిలీ కానున్న ఉద్యోగులు సెంటర్లను ఎంచుకోవాల్సి ఉంది. లంచాలు మరి గిన సిబ్బంది పదేళ్లు, పదిహేనేళ్లపాటు ఒకేచోట పనిచేసిన కొందరు ఉద్యోగులను ఏడాది, ఏడాదిన్నర, ఐదేళ్లు మాత్రమే పనిచేసినట్టుగా చూపిస్తూ సీనియూర్టీ జాబితాలను రూపొం దించారు. తద్వారా ఆ సెంటర్‌కు బదిలీ కోసం మరొకరు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా చేస్తున్నారు.
 
 ఏడేళ్లు చేస్తే ఏడాదిన్నర సీనియార్టీ
 డీఎంహెచ్‌వో కార్యాలయం విడుదల చేసిన సర్వీసు సీని యార్టీ జాబితాలో ఎన్నో చిత్రాలు చోటు చేసుకున్నారుు. జిల్లాలో 73 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా, ఒక్కొక్క పీహెచ్‌సీ పరిధిలో 6 నుంచి 12 సబ్‌సెంటర్లు పనిచేస్తున్నారుు. జిల్లాలో మొత్తం 548 సబ్‌సెంటర్లు ఉన్నాయి. మొత్తంగా 112 మంది డాక్టర్లు, 548 మంది రెగ్యులర్ ఏఎన్‌ఎంలు పనిచేస్తున్నారు. ఒకే పీహెచ్‌సీ పరిధిలోని పక్కపక్కన ఉండే సబ్ సెంటర్లకు మారుతూ కొందరు ఉద్యోగులు సీని యార్టీని తక్కువ చూపిస్తున్నారు. బదిలీ అంటే  ఒక పీహెచ్‌సీ నుంచి మరో పీహెచ్‌సీకి చేయూల్సి ఉంటుంది.  ఒకే డీడీవో (డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్) పరిధి కింద ఏడేళ్లు పనిచేసిన ఓ ఉద్యోగికి ఏడాదిన్నర మాత్రమే అక్కడ పనిచేసినట్టు సీని యూర్టీ జాబితాలో చూపించారు. ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో కె.శంకరరావు ఈ జాబితాలకు ఎందుకు ఆమోద ముద్ర వేయూల్సి వచ్చిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నారుు.
 
 దెందులూరు పీహెచ్‌సీ పరిధిలోని దెందులూరు సబ్‌సెంటర్, కొవ్వలి సబ్ సెంటర్‌లో పదేళ్ల పాటి పనిచేసిన నాగలక్ష్మి అనే ఏఎన్‌ఎంకు ఐదేళ్లు మాత్రమే సీని యార్టీ చూపించారు. పెదపాడు పీహెచ్‌సీ పరిధిలోని కొత్తూరు, వట్లూరు సబ్‌సెంటర్లలో ఏడున్నర ఏళ్లుగా పని చేస్తున్న రమాభగవతి అనే ఏఎన్‌ఎంకు ఏడాదిన్నర మాత్రమే సీనియార్టీ చూపించారు. అలాగే గుడివాకలంక పరిధిలోని సత్రంపాడు సబ్‌సెంటరులో మంగారత్నం అనే ఏఎన్‌ఎం స్పౌజ్ కేటగిరీలో 14 ఏళ్లుగా అక్కడే కొనసాగుతున్నారు. నిబంధనల ప్రకారం మూడేళ్లపాటు ఒకేచోట పనిచేసిన ఉద్యోగులు బదిలీకి అర్హులు. కానీ.. తక్కువ సీని యూర్టీ చూపడం ద్వారా వారిని వేరేచోటకు బదిలీ చేసే అవకాశం లేకుండా చేస్తున్నారు. ఇదిలావుండగా, కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేసేవారిని రెగ్యులర్ పోస్టుల్లో నియమించకూడదనే నిబంధనను కూడా తుంగలోకి తొక్కేస్తున్నారు. గుడివాకలంక పీహెచ్‌సీ పరిధిలోని శనివారపుపేట, పోణంగి సబ్ సెంటర్లలోని పోస్టులను రెగ్యులర్ ఏఎన్‌ఎంలతో భర్తీ చేయాలి. కానీ.. ఇక్కడ కాంట్రాక్టు ఉద్యోగులనే నియమిస్తున్నారు.
 
 తాజా జీవో బుట్టదాఖలు
 వైద్య, ఆరోగ్య శాఖ కమిషనరేట్ నుంచి ఇటీవల జారీ అరుున జీవో 785 ప్రకారం 20 శాతం హెచ్‌ఆర్‌ఏతో వరుసగా ఎక్కడ పనిచేసినా దాన్ని ఒకే సీనియార్టీ కింద చూపించాల్సి ఉంది. అరుుతే, సీనియూర్టీ జాబితాలను రూపొందించే విషయంలో జీవోలోని అంశాలను గాలికొదిలేశారు. ఒక మహిళా ఏఎన్‌ఎం గతంలో దెందులూరులో పనిచేశారు. అదే పీహెచ్‌సీ పరిధిలో పనిచేస్తున్నారు. 15 సంవత్సరాలుగా ఆమె 20 శాతం హెచ్‌ఆర్‌ఏ తీసుకుంటున్నారు. జాబితాలో ఆమెకు ఏడేళ్ల సీనియూర్టీ మాత్రమే చూపించారు. ఇదే కార్యాలయంలో క్యాషియర్‌గా శ్రీను అనే వ్యక్తి 12 ఏళ్లుగా పనిచేస్తున్నారు. అతనిని సీనియార్టీ జాబితాలో ప్రథముడిగా చూపించాలి. అలా చూపించలేదు. ఇక్కడే పనిచేస్తున్న రవీంద్ర అనే వ్యక్తి 12 ఏళ్లుగా  20 శాతం హెచ్‌ఆర్‌ఏ తీసుకుంటున్నా, అతని సీనియార్టీని ఆరేళ్లుగా మాత్రమే చూపించారు. ఈ వ్యవహారాల వెనుక భారీ ఎత్తున సొమ్ములు చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నారుు. వైద్య, ఆరోగ్య శాఖలో అక్టోబర్ 10లోగా బదిలీల ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది. వచ్చే నెల మొదటి వారంలో బదిలీల కౌన్సెలింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ కార్యాలయ పరిధిలో సాగుతున్న అక్రమ వ్యవహారాలపై కలెక్టర్ దృష్టి సారించి, అర్హులను ఆదుకోవాలని పలువురు ఉద్యోగులు కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement