యంత్రాల రిపేర్ల పేరుతో పత్తి కొనుగోళ్ల నిలిపివేసిన వ్యాపారులు గుట్టుగా తమ దందా కొనసాగిస్తున్నారు. కృష్ణా, నల్గొండ జిల్లాల్లో భారీగా పత్తిని కొనుగోలు చేస్తూ జమ్మికుంటకు తెచ్చి మిల్లుల్లో నిల్వ ఉంచుతున్నారు. స్థానికంగా కొనుగోళ్లు బంద్ చేసి వేరే ప్రాంతాల నుంచి తీసుకురావడం విమర్శలకు తావిస్తోంది.
జమ్మికుంట, న్యూస్‌లైన్ : కృష్ణా, నల్గొండ జిల్లాలో తక్కువ ధరకు పత్తి కొనుగోలు చేస్తున్న వ్యాపారులు లారీల్లో నేరుగా మిల్లులకు తరలిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. రైతులను దోచుకునేందుకే మార్కెట్‌కు సెలవులు పెట్టి మరీ ఇతర ప్రాంతాల నుంచి తెస్తున్నారనే ఆరోపణలొస్తున్నారుు. దూర ప్రాంతాల్లో పత్తి కొంటున్న వ్యాపారులు పట్టణంలో ఉన్న పత్తి మార్కెట్లో ఎందుకు కొనుగోళ్లు నిలిపివేశారో రైతులకు అంతుచిక్కడం లేదు. రోజుకు 15లారీల పత్తి జమ్మికుంటకు నేరుగా వస్తున్నా మార్కెటింగ్ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. సీజన్ ప్రారంభంలోనే రైతులు చేతికి వచ్చిన పత్తిని సకాలంలో అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడకతప్పడం లేదు. వ్యాపారులు కొనుగోళ్లు చేపట్టేందుకు ముందుకు రాని ఈ సమయంలో ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ మార్కెట్లో జాడలేకపోవడం చూస్తే రైతులపై చిత్తశుద్ధి ఎంటో అద్దం పడుతోంది.
వారుుదా వెనుక అసలు కథ ఏమిటో..?
ఈనెల 18న కొనుగోళ్లు ప్రారంభించాల్సి ఉండగా.. 23 కు పొడిగించారు. ముహూర్తాలు లేవంటూ కొనుగోళ్లకు దూరంగా ఉన్న వ్యాపారులు ఇతర ప్రాంతాలనుంచి పత్తిని ఎలా తెస్తున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు. మార్కె ట్లో కొనుగోలు చేస్తే మద్దతు ధర చెల్లించాల్సి ఉంటుం దనే వివిధ సాకులతో మార్కెట్‌కు సెలవులు ప్రకటించారు. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని తక్కువ ధరకు కొనుగోళ్లు చేయవచ్చని కుట్ర పన్నినట్లు అర్థమవుతోంది. సెలవులు ప్రకటించిన వ్యాపారులు గ్రామాల్లో కొనుగోళ్లు ఎందుకు కొనసాగిస్తున్నారో మార్కెటింగ్ శాఖ అధికారులే చెప్పాలి. శనివారం జమ్మికుంటలోని పలు మిల్లుల్లో వివిధ గ్రామాలను నుంచి వ్యాపారులు నేరుగా లారీల్లో పత్తిని మిల్లులకు తరలిం చగా ‘న్యూస్‌లైన్’ ఆ సన్నివేశాలను క్లిక్ మనిపించింది.
పత్తి వ్యాపారుల మాయాజాలం
Published Sun, Oct 20 2013 4:16 AM | Last Updated on Fri, Sep 1 2017 11:47 PM
Advertisement