నకిలీల స్థానాల్లో కొత్తవారికి | Counterfeiting positions apprentices | Sakshi
Sakshi News home page

నకిలీల స్థానాల్లో కొత్తవారికి

Published Thu, Mar 24 2016 2:35 AM | Last Updated on Sun, Sep 3 2017 8:24 PM

Counterfeiting positions apprentices

26మంది డీ ఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన
రాష్ట్ర విద్యాశాఖ నుంచి అందిన  జాబితా


చిత్తూరు(గిరింపేట): డీఎస్సీ-2014లో ఎస్జీటీ, లాంగ్వేజ్ పండిట్ పోస్టుల కు అర్హత సాధించిన 1,200 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను ఇటీవల విద్యాశాఖ పరిశీలించిన విషయం విధితమే. ఇందులో   26 మంది సర్టిఫికెట్లు నకిలీవని విద్యాశాఖ అధికారులు గుర్తించారు. ఆ జాబితాను రాష్ట్ర విద్యాశాఖకు పంపారు. వారు ఆ జాబితాను పక్కనబెట్టి కొత్త జాబితాను మంగళవారం రాత్రి డీఈవో కార్యాలయానికి పంపారు. ఈ క్రమంలో ఆ జాబితాలోని అభ్యర్థులు బుధవారం సాయంత్రం లోగా ఒరిజిన ల్ సర్టిఫికెట్లతో డీఈవో కార్యాలయానికి చేరుకోవాలని వారి సెల్‌ఫోన్లకు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు సందేశం పంపారు.

 
26 మంది అభ్యర్థులలో ఎస్జీటీలు 18 మంది, ల్యాంగ్వేజ్ పండిట్లు(హిందీ)-01, (తెలుగు)-05, వికలాంగులు - 2 ఉన్నట్లు డీఈవో కార్యాలయ సిబ్బంది పేర్కొన్నారు. అభ్యర్థుల సర్టిఫికెట్లను డీఈవో నాగేశ్వరరావు సమక్షంలో డీఎస్సీ సెక్షన్ సూపరింటెండెంట్ పురుషోత్తం, సిబ్బంది కుమార్ క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement