ఆర్‌ఎల్‌డీ నేత జయంత్‌సింగ్
సాక్షి, హైదరాబాద్: చిన్నరాష్ట్రాల ఏర్పాటుతోనే దేశం అభివృద్ధి చెందుతుందని రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్‌ఎల్‌డీ) జాతీయ ఉపాధ్యక్షుడు జయంత్‌సింగ్ అన్నా రు. ఆదివారం రాత్రి నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో టీఆర్‌ఎల్‌డీ(తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్) ఆధ్వర్యంలో నిర్వహించిన సామాజిక తెలంగాణ యుద్ధభేరి సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చారిత్రాత్మక అవసరమని, ప్రజలు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కపిల వాయి దిలీప్‌కుమార్, ప్రొఫెసర్ కేశవరావ్ జాదవ్, ఎమ్మెల్సీ ఆమోస్, విమలక్క, మల్లేపల్లి లక్ష్మయ్య, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, ప్రొ.లక్ష్మణ్, నారగోని, ఇందిరా దిలీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జయంత్‌సింగ్‌తో టీ.జేఏసీ నేతల భేటీ
జయంత్‌సింగ్‌తో తెలంగాణ జేఏసీ నేతలు ఆది వారం సమావేశమయ్యారు. జేఏసీ కో-చైర్మన్లు మల్లేపల్లి లక్ష్మయ్య, వి.శ్రీనివాస్‌గౌడ్, అడ్వొకేట్స్ జేఏసీ చైర్మన్ రాజేందర్ రెడ్డితో పాటు టీఆర్‌ఎల్‌డీ అధ్యక్షురాలు ఇందిరా దిలీప్‌కుమార్ తదితరులు జయంత్‌సింగ్‌ను కలిశారు. పోలవరం ముంపు గ్రామాలు మినహా మిగిలిన గ్రామాలన్నీ తెలంగాణ రాష్ట్రంలోనే ఉండాలని, దీనికోసం యూపీఏ ప్రభుత్వంపై ఆర్‌ఎల్‌డీ ఒత్తిడి తీసుకురావాలని జయంత్‌సింగ్‌ను వారు కోరారు.
చిన్న రాష్ట్రాలతోనే ప్రగతి
Published Mon, Mar 3 2014 3:09 AM | Last Updated on Fri, Oct 19 2018 7:52 PM
Advertisement
Advertisement