విజయనగరం: రహదారి భద్రత బిల్లుకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలన్నీ నిరసనలు చేపడుతున్నాయి. విజయనగరం జిల్లా పార్వతీపురంలో గురువారం ఉదయం పలు కార్మిక సంఘాల నాయకులు రహదారి భద్రతా బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలి నిర్వహించారు. ర్యాలి అనదతరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దకు చేరుకున్న నాయకులు కాంప్లెక్స్ ఎదుట బైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.