ఏలూరు (మెట్రో) : ఉమ్మడి రాష్ట్రం విడిపోవడంతో ఆంధ్రప్రదేశ్‌లో విలీనమై.. మన జిల్లాలో అంతర్భాగమైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాలను సర్కారు చిన్నచూపు చూస్తోంది. ఆ రెండు మండలాల అభివృద్ధిని ప్రభుత్వ శాఖలు పట్టించుకోవడం లేదు. అధికారులు సైతం ఆ మండలాల వైపు కన్నెత్తి చూడటం లేదు. ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన వైద్య, ఆరోగ్య శాఖ సైతం ఇదే ధోరణితో వ్యవహరిస్తోంది. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో ఉంటున్న సుమారు 30వేల మంది ఆరోగ్యాన్ని కాపాడేందుకు గతంలో ఖమ్మం జిల్లా అధికారులు ప్రతి మండలంలో రెండేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పారు. కుక్కునూరు, అమరవరం, వేలేరుపాడు, కొయిదా ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసి ఆయా మండలాల పరిధిలోని ప్రజలకు వైద్యసేవలు అందించే ఏర్పాటు చేశారు. ఆ రెండు మండలాలు జిల్లాలో విలీనం అయ్యాక అక్కడి ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెనుకాడుతున్నారు.
ఎందుకీ వివక్ష!
పూర్వ జిల్లాలోని 46 మండలాల్లో 175 పీహెచ్‌సీలతోపాటు వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో మరో 4 పీహెచ్‌సీలు కలిపి మొత్తం 179 పీహెచ్‌సీలు ఉన్నాయి. ప్రతి పీహెచ్‌సీకి ఏటా రూ.1.75 లక్షల చొప్పున ఆస్పత్రి అభివృద్ధి నిధులను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కేటాయిస్తుంది. ఇందులో రూ.లక్షను ఆస్పత్రి అభివృద్ధికి, రూ.50 వేలను ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు కల్పించేందుకు, రూ.25 వేలను పారిశుధ్యం మెరుగుదలకు ఉపయోగించాల్సి ఉంటుంది. పూర్వ జిల్లాలోని 175 పీహెచ్‌సీలకు ఈ మొత్తాలను కేటాయించినా.. వేలేరుపాడు, కుక్కునూరు మండలాలకు ఒక్క రూపాయి కూడా విదల్చలేదు.
విలీనమైనా విలువేది!
Published Thu, Mar 24 2016 11:38 PM | Last Updated on Sun, Sep 3 2017 8:29 PM
Advertisement