డీఎస్సీకి రంగం సిద్ధం
- జిల్లాలో 1187 పోస్టులు
- మైదానంలో 568, ఏజెన్సీలో 619
- రేషనలైజేషన్‌తో తగ్గిన పోస్టులు!
సాక్షి, విశాఖపట్నం: ఉపాధ్యాయ నియామకాలకు రంగం సిద్ధమైంది. ఉపాధ్యాయ దినోత్సవం నాడు డీఎస్సీ నోటిఫికేషన్ రానుంది. జిల్లాలో 1900కు పైగా ఖాళీలు ఉండగా కేవలం 1187 పోస్టుల్ని మా త్రమే డీఎస్సీకి జిల్లా విద్యాశాఖ నోటిఫై చేసిం ది. ఇందులో ఏజెన్సీలోనే ఎక్కువ పోస్టులున్నాయి. మరోవైపు అన్ని కేట గిరీల్లో కలిపి సుమారు 220 బ్యాక్‌లాగ్ పోస్టులు ఉన్నాయి. జిల్లాలో సుమారు 750 పోస్టులకు రేషనలైజేషన్ కారణంగా కోత పడింది. దీంతో అభ్యర్థులకు కాస్త నిరాశ కలిగినట్టయింది.
ఆ మూడు సబ్జెకులే అధికం : రానున్న డీఎస్సీలో జిల్లాలో గణితం(106), సోషల్(131), హిందీ భాషా పండిత(57) పోస్టులు అధికంగా ఉన్నాయి. బయాలజీ(29), స్కూల్ అసిస్టెంట్ తెలుగు(28), పీఈటీ(28) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మైదాన ప్రాంతంలో స్కూల్ అసిస్టెంట్ ఆంగ్లం, తెలుగు భాషా పండిత పోస్టులు ఒక్కటి కూడా లేదు. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్‌స, ఫిజికల్ డెరైక్టర్ (పీడీ)పోస్టులు మైదాన, ఏజెన్సీలో ఒక్కటి లేకపోవడం విశేషం. ఎస్జీటీ ఆశావహులకు ఈ డీఎస్సీ ఆశాజనకంగా ఉంది. మైదాన ప్రాంతంలో కంటే ఏజెన్సీలో ఎస్జీటీ పోస్టులు అధికంగా ఉన్నాయి. సుమారు 150 వరకు బ్యాక్‌లాగ్ పోస్టులని సమాచారం. మైదానంలో అన్ని కేటగిరీల్లో కలిపి మరో 70 పోస్టుల వరకు బ్యాక్‌లాగ్‌లో ఉన్నాయి.