ఈ నెల చివరిలో డీఎస్సీ కౌన్సెలింగ్ | end of this month, DSC counseling | Sakshi
Sakshi News home page

ఈ నెల చివరిలో డీఎస్సీ కౌన్సెలింగ్

Published Thu, May 19 2016 1:05 AM | Last Updated on Mon, Sep 4 2017 12:23 AM

end of this month, DSC counseling

చిత్తూరు (గిరింపేట): డీఎస్సీ-2014లో ఎంపికైన స్కూల్ అసిస్టెంట్, పీఈటీల ఎంపిక జాబితాలను జిల్లా విద్యాశాఖ అధికారులు బుధవారం రాష్ట్ర విద్యాశాఖకు పంపారు. ఆ జాబితాను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు పరిశీలించి రోస్టర్ ప్రకారం ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు.


ఎంపికయ్యే వారి వివరాలను రాష్ట్ర విద్యాశాఖ నుంచి అభ్యర్థుల మొబైల్స్‌కే సందేశం  అందుతుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఈనెల చివరిలోపు ఎంపికైన వారికి కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగులు, నియామకపత్రాలు ఇవ్వనున్నారు. విద్యాశాఖ సిబ్బంది డీఎస్సీలో ఎంపికైన వారి దరఖాస్తులను పరిశీలించే పనిలో నిమగ్నమయ్యారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement