
అవన్నీ ఊహాగానాలే: ఈటెల
హైదరాబాద్: కాంగ్రెస్లో తమ పార్టీ విలీనం అవుతుందని మీడియాతో వస్తున్న కథనాలన్ని ఊహాగానాలేనని టీఆర్ఎస్ శాసనసభ పక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. పార్లమెంట్ ఉభయసభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పోందేవరకు రాజకీయంగా ఎలాంటి చర్చలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ ఢిల్లీ నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి తిరిగి వస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రేపు తమ పార్టీ ఎమ్మెల్యేలమంతా ఢిల్లీ వెళ్తున్నట్టు ఈటెల రాజేందర్ తెలిపారు.
కాగా, బిల్లుపై ముందుకువెళ్లటానికి ముందుగానే టీఆర్‌ఎస్ ‘రాజకీయ నిర్ణయాల’పై కాంగ్రెస్ నుంచి పెరుగుతున్న ఒత్తిడి కేసీఆర్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోందని ఆయన సన్నిహితులు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో టీఆర్‌ఎస్ విలీనం గురించి కేసీఆర్‌నే అడగాలని దిగ్విజయ్ సింగ్ అన్నారు.