దొంగనోట్లు చెలామణి చేస్తున్న ఇద్దరి అరెస్ట్ | fake notes circulated in the case of a false arrest | Sakshi
Sakshi News home page

దొంగనోట్లు చెలామణి చేస్తున్న ఇద్దరి అరెస్ట్

Published Sun, Sep 29 2013 2:31 AM | Last Updated on Fri, Sep 1 2017 11:08 PM

fake notes circulated in the case of a false arrest

విజయనగరం టౌన్, న్యూస్‌లైన్ : పట్టణంలో దొంగనోట్లు చెలామణి చేస్తున్న ఇద్దరు వ్యక్తులను సీసీఎస్ పోలీసులు శని వారం ఉదయం గాజులరేగ సమీపంలో అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 32 వంద రూపాయల నకిలీ నోట్లను, రూ.38 వేల నగదు, దొంగనోట్ల తయారీకి వినియోగించే నల్ల కాగితా ల క ట్టలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీసీఎస్ సీఐ ఎ.వి.రమణ శనివారం స్థానిక వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో శనివారం వెల్లడించారు.
 
 పట్టణానికి చెందిన గొర్లె హేమచంద్ర, గంగళ్ల అజయ్‌కుమార్‌లు కశింకోటకు చెందిన శంకరరావుతో స్నేహం ఏర్పరచుకుని దొంగనోట్లు చెలామణి చేయడానికి ప్రణాళిక రచించారు. గాజుల రేగ ప్రాంతంలో నకిలీ నోట్లు మారుస్తుండగా.. విశ్వసనీయ సమాచారం మేరకు సీసీఎస్ బృందం వలపన్ని పట్టుకుంది. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని, మరో నింది తుడు శంకరరావు ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు సీఐ రమణ తెలిపారు. వీరిపై గతంలోనూ పలు కేసులు ఉన్నాయని చెప్పారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో సీఐలు టి.కల్యాణి, సీసీఎస్ ఎస్సై సన్యాసిరావు, వన్‌టౌన్ ఎస్సై ధనుంజయరావు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement