అమర్‌రాజా ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం | fire accident in Amara raja batteries in chittoor plant | Sakshi
Sakshi News home page

అమర్‌రాజా ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం

Published Sat, Jan 21 2017 9:01 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

అమర్‌రాజా ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం - Sakshi

అమర్‌రాజా ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం

చిత్తూరు : చిత్తూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పూతలపట్టు మండలం పేటమిట్టలోని అమర్‌రాజా బ్యాటరీ ప్లాంట్‌లో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాంట్‌లో భారీగా మంటలు ఎగిసిపడుతుండడంతో కార్మికులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు.

సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో 20 మంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలతో పాటు ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement