మదినిండా అభిమానం.. పేదలకు అన్నదానం | Fondness for YS Rajasekhara Reddy And Serve To Poor people Prakasam | Sakshi
Sakshi News home page

మదినిండా అభిమానం.. పేదలకు అన్నదానం

Published Sat, Sep 7 2019 10:39 AM | Last Updated on Sun, Sep 8 2019 10:39 AM

Fondness for YS Rajasekhara Reddy And Serve To Poor people Prakasam - Sakshi

ఓదార్పు యాత్రకు కాకర్ల వచ్చిన జగన్‌తో మోషే(ఫైల్‌)

సాక్షి, కాకర్ల(ప్రకాశం): అర్ధవీడు మండలంలోని కాకర్ల గ్రామానికి చెందిన పరిశపోగు మోషే ఓ నిరుపేద. రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి అంటే ఎంతో అభిమానం. నల్లమలో జరిగిన హెలికాఫ్టర్‌ ప్రమాదంలో వైఎస్సార్‌ మరణించినప్పటి నుంచి ఆయనకు గుర్తుగా గ్రామంలోని పేదలకు ప్రతి శనివారం అన్నదానం చేస్తూ అభిమానాన్ని చాటుకుంటున్నాడు. 2002లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పు యాత్రలో భాగంగా కాకర్ల గ్రామానికి వచ్చినప్పుడు మోషే ఇంటి దగ్గర వైఎస్సార్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఆ విగ్రహం ఎదుట మోషే తన భార్య మరియమ్మతో కలిసి అన్నదానం చేస్తున్నారు. ‘రోజూ నేను, నా భార్య ఉపాధి పనికి, పొలం పనులకు పోతాం. సంపాదించుకున్నదాంట్లో కొంత డబ్బుతో నలుగురికీ అన్నం పెడుతున్నాం. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పేదోళ్లకు ఎంతో మంచిజేశాడు. బీదోన్నయినా ఆయనపై అభిమానంతోనే అన్నదానం చేస్తున్నా. సీఎం అయిన తర్వాత వచ్చి కలువు అని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. జగనన్నను త్వరలోనే కలిసి రాజన్న భోజనశాల ఏర్పాటు చేసేందుకు సహాయం చేయాలని కోరతా’ అని తెలిపాడు.


మోషే ఇంటి వద్ద భోజనం చేస్తున్న గ్రామస్తులు(ఫైల్‌) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement