
ఏసీబీ వలలో ఫారెస్ట్ అధికారి
శ్రీకాకుళం : అటవీ శాఖ అధికారి అవినీతి నిరోధక శాఖాధికారులకు పట్టుబడిన సంఘటన శ్రీకాకుళంలో చోటుచేసుకుంది. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్‌గా పని చేస్తున్న ఎం.త్రినాథ్‌నాయుడు ఓ వ్యక్తి నుంచి రూ. 15 వేలు లంచం డిమాండ్ చేశాడు.
శనివారం ఉదయం లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.