భూసేకరణపై అన్నదాతల ఆగ్రహం
విజయనగరం: భోగాపురంలో నిర్మించతలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు వ్యతిరేకంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద సోమవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. వేలాది మంది ప్రజలు, నాయకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్.వి. సుజయ్ కృష్ణ రంగారావు మాట్లాడారు. అనంతరం ర్యాలీగా కలెక్టరేట్ వరకూ వెళ్లారు. కొందరు నాయకులు కలెక్టరేట్‌లోకి వెళ్లి జాయింట్ కలెక్టర్ బి రామారావుకు వినతిపత్రాన్ని సమర్పించారు.