కాల్వలో మునిగి నలుగురు చిన్నారుల మృతి | Four Children drown in Vamsadhara canal in Srikakulam District | Sakshi
Sakshi News home page

కాల్వలో మునిగి నలుగురు చిన్నారుల మృతి

Published Sun, Oct 6 2013 12:41 PM | Last Updated on Fri, Sep 1 2017 11:24 PM

Four Children drown in Vamsadhara canal in Srikakulam District

శుబలాయి: శ్రీకాకుళం జిల్లా హిర మండలంలో శుబలాయి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గొట్ట బ్యారేజ్ వద్ద వంశధార కుడికాల్వలో మునిగి నలుగురు చిన్నారులు మృతి చెందారు. స్నానం చేసేందుకు కాల్వలోకి దిగి వీరు ప్రాణాలు కోల్పోయారు.

నాలుగో తరగతి చదువుతున్న ఎ. బాలు, రెండు, ఆరు, ఏడు తరగతి విద్యార్థినులు టి. సవ్రంతి, టి. తులసి, కె. మానస మృతి చెందారు. నీళ్లలో మునిగిన మరో విద్యార్థిని అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చిన్నారుల మరణంతో శుబలాయి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. చిన్నారుల తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement