నెల్లూరు(క్రైమ్): ఓ వ్యక్తికి రైల్వే ఉద్యోగం ఇప్పిస్తామంటూ రూ. 2 లక్షలు వసూలుచేసిన అన్నా, చెల్లెలుపై శనివారం నాల్గోనగర పోలీ సులు చీటింగ్ కేసు నమోదు చేశా రు. పోలీసుల కథనం మేరకు. నగరంలోని వెంకటేశ్వరపురం గాంధీగిరిజన కాలనీకి చెందిన నల్లగండ్ల రవికుమార్, సునీత అన్నాచెల్లెలు.
రవికుమార్ పెరంబూర్‌లోని రైల్వేకేంద్రంలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుండగా, సునీత నెల్లూరు రైల్వేస్టేషన్‌లో గ్యాంగ్‌ఉమన్‌గా పనిచేస్తున్నారు. కొంతకాలం కిందట రవి కుమార్ బ్లూస్టిక్ కడ్డీలు, సాం బ్రాణి తయారీ పేరిట పత్రికా ప్రకటన ఇచ్చాడు. అది చూసిన కొడవలూరు మండలం మానేగుంటపాడుకు చెందిన దర్శిగుంట మల్లికార్జున ఫోన్లో సంప్రదించాడు. రవి కుమార్ వద్ద మిషన్ కొనుగోలు చేసి కొంతకాలం ఇంటి వద్దే బ్లూస్టిక్‌కడ్డీలు, సాంబ్రాణి తయారుచేసి ఆయనకు అమ్మాడు. ఈ క్రమంలో ఇద్దరూ స్నేహితులయ్యారు. తా ను, తన చెల్లెలు సునీత రైల్వే ఉ ద్యోగులమని, రూ. 7లక్షలు పెట్టుకుంటే రైల్వే ఉద్యోగం ఇప్పిస్తామ ని మల్లికార్జునను రవికుమార్ నమ్మించాడు.
బేరసారాల అనంతరం రూ. 2 లక్షలు మల్లికార్జున వారికి మూడు దఫాలుగా చెల్లించాడు. వారు ఓ ఫోర్జరీ నియామక పత్రాన్ని మల్లికార్జునకు ఇచ్చారు. అది గమనించి వారిని నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మోసపోయానని గ్రహించిన మల్లికార్జున తన డబ్బు వెంటనే తిరిగి చెల్లించాలని కోరాడు. రేపు, మాపు అంటూ కాలయాపన చేస్తుండటంతో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రవికుమార్, అతడి సోదరి సునీతపై ఎస్‌ఐ వెంకటేశ్వర్లు చీటింగ్ కేసు నమోదు చేశారు.
రైల్వే ఉద్యోగం పేరిట మోసం
Published Sun, Jul 27 2014 2:34 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement