కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కంటే నా ప్రజల మనోభావాలే నాకు ముఖ్యమని రాష్ట్ర మంత్రి శత్రుచర్ల విజయరామరాజు గురువారం విజయనగరంలో స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కంటే నా ప్రజల మనోభావాలే నాకు ముఖ్యమని రాష్ట్ర మంత్రి శత్రుచర్ల విజయరామరాజు గురువారం విజయనగరంలో స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తనను బాధించిందని ఆయన పేర్కొన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. వయస్సు సహకరించపోవడం వల్లే సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనడం లేదని శత్రుచర్ల విజయరామరాజు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి నిరసనగా అటవీశాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, వైద్య విద్య మంత్రి కొండ్రు మురళిలు మంగళవారం తమ పదవులకు రాజీనామా చేశారు. అనంతరం రాజీనామా లేఖలను సీఎం కిరణ్కు క్యాంప్ కార్యాలయంలో అందజేసిన సంగతి తెలిసిందే.