హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డికి చట్ట ప్రకారమే బెయిల్ వచ్చిందని ప్రభత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ తెలిపారు. జగన్ కు సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసిన అనంతరం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. జగన్మోహనరెడ్డికి బెయిల్ రావడం వెనుక కాంగ్రెస్ హస్తం ఉందన్న బాబు వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఆయన వ్యాఖ్యలు అర్ధరహితమని ఆయన తెలిపారు. జగన్ కు చట్ట ప్రకారమే బెయిల్ వచ్చిందన్న విషయాన్ని బాబు తెలుసుకోవాలన్నారు.
సిబిఐ ప్రత్యేక కోర్టు జగన్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. జగన్ హైదరాబాద్ వదిలి వెళ్లరాదని కోర్టు షరతు విధించింది. అలాగే రెండు లక్షల రూపాయల విలువైన రెండు పూచీకత్తులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.