సాక్షి, తిరుపతి: బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. అర్థరాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు తమిళనాడు సమీపంలో ఉన్న నగరి, పుత్తూరు, పలమనేరు, కుప్పం, పుంగనూరు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది.
దీంతో జన జీవనం స్తంభించింది. ఇటీవల కురిసిన వర్షాలతో జిల్లాలోని చెరువులు నిండి ఉన్నాయి. తాజాగా పడుతున్న వర్షాలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment