చిత్తూరు (సెంట్రల్): గ్రామ పంచాయతీల్లో డంపింగ్ యార్డుల ఏర్పాటుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ఎంపీడీవోలను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఆయన జిల్లాలోని ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జన్మభూమి కార్యక్రమంలో పెద్ద ఎత్తున డంపింగ్ యార్డుల ఏర్పాటుకు పూనుకోవాలన్నారు. ఎస్‌ఆర్‌హెచ్‌ఎం కింద ప్రతి గ్రామపంచాయతీకి పారిశుద్ధ్య పనుల నిమిత్తం రూ.50 వేలు విడుదల చేశారని, ఈ నిధులను సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు.
మండలాలకు వివిధ అభివృద్ధి పనులు మంజూరవుతు న్నా, అవి పూర్తికావడం లేదన్నారు. ఇకపై పనులు మంజూరైన 90 రోజుల్లో పూర్తికాకపోతే వాటికి సంబంధించిన నిధులను వేరే మండలాలకు ఇస్తారని తెలిపారు. ఈ కాన్ఫరెన్స్‌లో జెడ్పీ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ రవిప్రకాష్‌రెడ్డి, డీపీవో ప్రభాకర్, డ్వామా పీడీ గోపిచంద్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
బాధితులకు విరాళం
హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం రేణిగుంట మండలానికి చెందిన సర్పంచ్‌లు భాస్కరయాదవ్ (తూకివాకం), మునిశేఖర్‌రెడ్డి (ఆర్.మల్లవరం), శ్రీరాజ్ (గాజులమండ్యం), హరినాథ్‌యాదవ్ (అత్తూరు), ఎం.పురుషోత్తం (విప్పమానుపట్టెడ) కలిసి మొత్తం రూ.57,635 విరాళాన్ని కలెక్టర్‌కు అందజేశారు. అలాగే తిరుపతి మండల సర్పంచ్‌లు లక్ష రూపాయలు ఇచ్చారు.
డంపింగ్ యార్డుల ఏర్పాటుకు సత్వర చర్యలు
Published Sat, Oct 18 2014 3:29 AM | Last Updated on Sat, Apr 6 2019 9:01 PM
Advertisement