న్యూఢిల్లీ: మెడికల్ వీసా ద్వారా భారత్‌కు వచ్చి వైద్య సేవలు పొందుతున్నవారి సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతోంది. మెడికల్ వీసా ద్వారా విదేశాల నుంచి భారత్‌కు వచ్చి 2016లో 2,01,333మంది వైద్య సేవలు పొందినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అలాగే, 2014, 2015లలో వరుసగా 75,688మంది, 1,34,344మంది వచ్చి వైద్య సేవలు పొందారని తెలిపింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వీ విజయసాయిరెడ్డి బుధవారం రాజ్యసభలో విదేశీయులకు ఇచ్చే మెడికల్ వీసాలు, రెండో దశలో భాగంగా ఆయా రాష్ట్రాల తీర ప్రాంతాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర ప్రాంతానికి మంజూరు చేసిన పోలీస్ స్టేషన్లు, జెట్టీలపై పర్యాటకశాఖ, కేంద్ర హోంశాఖల నుంచి వివరాలు కోరారు.
ఇందులో మెడికల్ వీసాలపై అడిగిన ప్రశ్నకు పర్యాటక మంత్రిత్వశాఖ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది. అలాగే, మెడికల్ పర్యాటకాన్ని మరింత పెంపొందించేందుకు మెడికల్ వీసాల అందజేత ప్రక్రియలో వేగాన్ని పెంచినట్లు కూడా పేర్కొంది. వైద్యపరమైన సేవలకోసం విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు ఈ మెడికల్ వీసా కార్యక్రమాన్ని మరిత విస్తృతం చేస్తున్నామని వెల్లడిచింది. ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్, ఫారినర్స్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సూచించిన విధంగా ఆయా కేసులను బట్టి వీసా గడువు ఆరు నెలల వరకు పొడిగించే అవకాశం ఉందని చెప్పారు. ఎమర్జెన్సీ మెడికల్ వీసాలపై 48గంటల్లో దరఖాస్తును పరిశీలిస్తామని చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర ప్రాంతంలో పోలీస్ స్టేషన్ల వివరాలపై..
ఫేజ్-2లో భాగంగా ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర ప్రాంతంలో కొత్తగా 15 పోలీస్ స్టేషన్లు మంజూరు చేశామని కేంద్ర హోంశాఖ తెలిపింది. ఇందులో 11 స్టేషన్లను ఇప్పటికే పూర్తి చేసినట్లు వెల్లడించింది. అలాగే, ఏడు జెట్టీలను మంజూరు చేశామని వాటిల్లో ఇప్పటి వరకు ఒక్కటీ ఇంకా నిర్మాణం ప్రారంభంకాలేదని తెలిపింది. అలాగే, మత్యకారులు ఉపయోగించే పడవలకు నావిగేషన్, కమ్యునికేషన్ సాంకేతిక పరిజ్ఞానంవంటివి కచ్చితంగా ఉండాలా వద్దా అనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని కూడా కేంద్రం స్పష్టతనిచ్చింది.
మెడికల్ వీసాల డేటా ఉందా?: విజయసాయిరెడ్డి
Published Wed, Mar 22 2017 5:11 PM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement