గుంటూరులో ఐటీ దాడులు | Income Tax Raids On TDP Leader Kovelamudi Ravindra House In Guntur | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 29 2018 10:37 AM | Last Updated on Mon, Oct 29 2018 10:56 AM

Income Tax Raids On TDP Leader Kovelamudi Ravindra House In Guntur - Sakshi

సాక్షి, గుంటూరు : ఆంధ్రపద్రేశ్‌లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. తాజాగా టీడీపీ నేత, ఎల్‌వీఆర్‌ క్లబ్‌ కార్యదర్శి, వ్యాపారవేత్త కోవెలముడి రవీంద్ర ఇంట్లో ఐటీ దాడులు జరిగాయి. సోమవారం తెల్లవారు జాము నుంచి  రవీంద్ర ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. రవీంద్ర పెట్రోల్‌ బంకులు, గ్యాస్‌ ఏజెన్సీలు నిర్వహిస్తున్నారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలోని వివిధ వ్యాపార వేత్తలు, టీడీపీ నేతలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 

వరుస ఐటీ దాడులతో టీడీపీ నేతల్లో అలజడి మొదలయింది. ఇటీవలే ఆ పార్టీ ఎంపీ సీఎం రమేశ్‌పై  ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈసందర్భంగా అనేక డాక్యుమెంట్లు, విలువైన పత్రాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు టీడీపీ నేత బీద మస్తాన్‌రావుపై కూడా గతంలో ఐటీ సోదాలు జరిగాయి. ఏక కాలంలో ఆయన కంపెనీలపై దాడులు జరిపి రికార్డులు, కంప్యూటర్‌ డేటాలను స్వాధీనం చేసుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement