బొబ్బిలి టీడీపీలో ముసలం
బొబ్బిలి: బొబ్బిలి తెలుగుదేశం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. బొబ్బిలి, తెర్లాం నియోజకవర్గాలు విలీనం అయిన తర్వాత టీడీపీ ప్రభుత్వం ఏర్పడడం మొదటి సారి కావడంతో ఎవరికి వారే తమ ఆధిపత్యం నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పటి తెర్లాం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చేసి ఇప్పుడు బొబ్బి లి అధికార పార్టీకి నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న తెంటు లక్ష్ముంనాయుడుతో ఇటు పట్టణ, అటు మండల నాయకులకు అస్సలు పొసగడం లేదు. బయటకు అందరూ బాగానే ఉంటున్నా, లో పల్లోపల మాత్రం కత్తులు దూసుకుంటున్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శిగా వ్యవహరిస్తూ మున్సిపాలిటీలో కీలక బాధ్యతలు వహిస్తున్న తూముల భాస్కరరావుకు నియోజకవర్గ ఇన్‌చార్జి తెంటుకు మధ్య అంతర్గత విభేదాలు రోజు రోజుకు అధికమవుతున్నట్లు బా హాటంగా ప్రచారం జరుగుతోంది.
ము న్సిపల్ చైర్‌పర్సన్‌గా తూముల అచ్యుతవల్లి ఇక్కడ పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుడడం, పార్టీ అధినాయకత్వంతో ఎప్పటికప్పుడు సత్సంబంధాలతో ఉండడంతో ఇది మ రింత బలపడుతోంది. జనవరి ఒకటో తేదీ నాడు శుభాకాంక్షలు అందుకోవడానికి పార్టీ కార్యాలయంలో తెంటు ఉంటే, లోకబంధు వద్ద తూముల దంపతులు వేడుకలు జరుపుకున్నారు. అలాగే గత నెలలో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి వేడుకల్లో దక్షిణిదేవిడి వద్ద ఇన్‌చార్జి తెంటు పాల్గొంటే, లోకబంధులో తూ ముల పాల్గొని వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించారు. బొబ్బిలికి వచ్చిన మంత్రులు, జిల్లా స్థాయి నేతలంతా ని యోజకవర్గ పార్టీ కార్యాలయం ఉం టుండగానే పక్కనే ఉన్న తూముల ఇంటికి వెళ్లి అక్కడ నుంచి అటే వెళ్లిపోవడాన్ని కూడా కొంత మంది జీర్ణించుకోలేకపోతున్నారనే వాదన కూడా ఉంది.
రెండు నియోజకవర్గాలతో ముడి పడు న్న ఏఎంసీ చైర్మన్ పోస్టు భర్తీ జాప్యం జరగడానికి కూడా ఈ విభేదాలే కారణమని చర్చ జరుగుతోంది. పట్టణంలోని 26వ వార్డు కౌన్సిలరు, సినీ నిర్మాత, అం జనీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పువ్వుల శ్రీనివాసరావుకు ఏఎంసీ ఇవ్వడానికి నియోజకవర్గ ఇన్‌చార్జి తెంటు దాదాపుగా నిర్ణయానికి వచ్చేశారు. రేపో మాపో ప్రకటన కూడా వెలువడానికి సిద్ధంగా ఉంది. అయితే వ్యవసాయ మా ర్కెట్ కమిటీ పోస్టు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి ఇస్తే బాగుంటుందని, పార్టీ కూడా అభివృద్ధి జరుగుతుందని, ఒక పదవి ఉన్న వారికి ఈ పదవి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ తెంటు వ్యతిరేక వర్గం పార్టీ అధిష్టానానికి చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ఈ పోస్టు భర్తీ పెండింగ్ పడినట్లు చెబుతున్నారు.
పార్వతీపురం నియోజవర్గంలోని బలిజిపేట, సీతానగరం మండలాలు కూడా బొబ్బిలి ఏఎంసీ పరిధిలో ఉండడంతో ఓ వైపు ఆయా మండలాలకు చెందిన నాయకులకు ఈ పదవి కావాలంటూ మరో వర్గం ఇప్పటికే అధిష్టానం వద్దకు వెళ్లింది. మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ పదవి కోసం పోటీ వచ్చినపుడు ఒకటో వార్డు కౌన్సిలరు చోడిగంజి రమేష్‌నాయుడుకు ఈ పదవి ఇస్తామని మాట ఇచ్చారు. అయితే అప్పుడు ఏఎంసీ చైర్మన్ నియామకం భర్తీలో జా ప్యం జరగడంతో ముందుగా మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని అప్పగించారు. ఏడాది పదవి కోసం అయిదేళ్ల వైస్ చైర్మన్ పదవిని ఎందుకు వదులుకోవాలా అని చోడిగంజి ఆలోచనలో పడినట్లు సమాచారం. ఇదిలా ఉండగా బొబ్బిలిలో కూడా దేశం నాయకుల ఆధిపత్య పోరు ఎక్కువైంది.
మున్సిపాలి టీలో బాధ్యతలు చూస్తున్న తూములకు, మండలంలో బాధ్యతలు చూ స్తున్న అల్లాడ భాస్కరరావుల మధ్య వైరం చాపకింద నీరులా సాగుతుంది. అలాగే మండల నాయకులైన అల్లాడతో ఇటీవల కాంగ్రెస్ నుంచి టీడీపీలోనికి వచ్చిన బొద్దల సత్యనారాయణ వర్గానికి కూడా అంతర్గత పోరు మొదలైంది. ఇటీవల బొబ్బిలిలోని చైర్‌పర్సన్ అచ్యుతవల్లి సొంత వార్డు అయిన 20 వార్డులో ఓ ప్రైవేటు కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు నియోజకవర్గ ఇన్‌చార్జి తెంటు, పారాది సర్పంచి అల్లాడ భాస్కరరావులు హాజరయ్యారు. దీనిపై కూడా పట్టణ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సమాచారం ఇవ్వకుండా వార్డుల్లోకి ఎలా వస్తారంటూ ప్రశ్నించినట్లు సమాచారం.