రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ 150 రోజులుగా సీమాంధ్ర న్యాయవాదులు చేస్తున్న ఉద్యమంలో అపశ్రుతి చోటుచేసుకుంది.
దీక్షా శిబిరంలో అపస్మారకంలోకి సీనియర్ న్యాయవాది... ఆసుపత్రిలో కన్నుమూత
కడప, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ 150 రోజులుగా సీమాంధ్ర న్యాయవాదులు చేస్తున్న ఉద్యమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. కడప జిల్లా కోర్టు వద్ద ఉన్న దీక్షా శిబిరంలో 30 రోజులపాటు దీక్షలు చేసిన సీనియర్ న్యాయవాది లక్ష్మీనరసయ్య బుధవారం దీక్షా శిబిరంలో అపస్మారక స్థితికి చేరుకుని అర్ధరాత్రి ఆస్పత్రిలో కన్నుమూశారు. సమైక్య ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొంటూ సుమారు 30 రోజులకు పైబడి రిలే దీక్షలు చేయడంతో ఆరోగ్యం క్షీణించింది. దీంతో బుధవారం దీక్షా శిబిరంలోనే అపస్మారక స్థితికి చేరుకున్న ఆయనను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. లక్ష్మీనరసయ్య మృతికి సంతాపంగా గురువారం న్యాయవాదులు సంతాపసభ నిర్వహించారు.