కిరణ్, బాబులది రాధాకృష్ణుల ప్రేమ! | Kiran Kumar Reddy, Chandrababu Naidu relation is like Radha Krishna's love life | Sakshi
Sakshi News home page

కిరణ్, బాబులది రాధాకృష్ణుల ప్రేమ!

Published Tue, Jan 28 2014 1:54 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

కిరణ్, బాబులది రాధాకృష్ణుల ప్రేమ! - Sakshi

కిరణ్, బాబులది రాధాకృష్ణుల ప్రేమ!

  • ముంపు తప్పదని తెలిసినా ఆంధ్రజ్యోతి అధిపతికి చెందిన యాక్టివ్ పవర్ ప్లాంట్ తెరవడానికి ప్రభుత్వం అనుమతి
  •   బుడమేరు ఆధునీకరణకు అడ్డంకిగా మారిన ప్లాంటు
  •   ఆధునీకరణ చేయకుంటే.. విజయవాడకు ముంపు తప్పదని తేల్చిన ఇంజనీరింగ్ నిపుణులు.. ఆ మేరకు ప్లాంటుకు
  •  చంద్రబాబు ఇచ్చిన ఎన్‌వోసీని రద్దు చేసిన వైఎస్ సర్కారు
  •   రోశయ్య హయాంలోనూ అనుమతి నిరాకరణ
  •   ఇద్దరు సీఎంలు కాదన్న ప్లాంటుకు.. ఇప్పుడు కిరణ్ ఓకే
  •   కొత్త పార్టీ పెట్టనున్న నేపథ్యంలో పత్రికాధిపతికి కానుక!
  •   ప్లాంటు కోసం పోలవరం డిజైన్‌కే మార్పులు చేస్తున్నారు: విశ్లేషకులు
  •  
     సాక్షి, హైదరాబాద్: విజయవాడ దగ్గరలోని బుడమేరు కాల్వపై ‘ఆంధ్రజ్యోతి’ పత్రికాధిపతి రాధాకృష్ణకు చెందిన ‘యాక్టివ్’ పవర్ ప్లాంట్‌కు గతంలో చంద్రబాబు ఇచ్చిన అనువుతులే అత్యంత వివాదాస్పదం కాగా.. గత ఐదారేళ్లుగా వుూతపడి ఉన్న ఈ ప్లాంటుకు కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వం తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం వురింత వివాదాస్పదం కానుంది. శనివారం అనుమతి ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీఎం కొత్త పార్టీ ఏర్పాటు వార్తలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో, ఒక ఎల్లో పత్రికాధిపతికి దక్కిన ఈ కానుక రాజకీయు, ఇంధన వర్గాల్లో చర్చనీయూంశమైంది!
     
     కృష్ణా-గోదావరి అనుసంధాన మార్గం.. బుడమేరు
     వరదలు వచ్చే ప్రతిసారీ బుడమేరు కాల్వ ద్వారా విజయవాడ పట్టణంలో ముంపు సమస్య తలెత్తుతోంది. ఆరేళ్ల క్రితం వచ్చిన ఓగ్ని తుపాను సమయంలో బుడమేరు ముంపునకు 30 వేల ఎకరాల విస్తీర్ణంలోని పంటలు మునిగిపోయాయి. దాంతోపాటు విజయవాడలోని పాయకాపురం, సింగ్‌నగర్, నున్న తదితర ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఆ సందర్భంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ఈ ముంపును ఎదుర్కోవడానికి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఇరిగేషన్ అధికారులు బుడమేరు ఆధునీకరణకు రూ. 241.45 కోట్లతో ప్రణాళిక రూపొందించారు. 15 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యం గల ఈ కాల్వను 37,555 క్యూసెక్కుల ప్రవాహ సామార్థ్యానికి ఆధునీకరించాలని ప్రతిపాదించారు. ఆ మేరకు వైఎస్ 2009 ఫిబ్రవరిలో జీవోను (నంబర్: 30) జారీ చేశారు. ఆధునీకరణలో భాగంగా కాల్వను 1.5 మీటర్ల మేర తవ్వి నీటి ప్రవాహాన్ని పెంచాలని నిర్ణయించారు. అలాగే రెండు వైపులా ప్రత్యేకంగా రక్షణ చర్యల్ని చేపట్టాలనుకున్నారు. ఆధునీకరణ అనంతరం పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా బేసిన్‌కు తరలించే 80 టీఎంసీల నీరు కూడా ఈ బుడమేరు ద్వారానే రావాల్సి ఉంది. అంటే... గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం ఈ కాల్వ ద్వారానే సాధ్యమవ్వాల్సి ఉంది. భారీ వర్షాలు వచ్చిన సమయంలో స్థానికంగా ముంపును త ట్టుకోవడంతో పాటు, గోదావరి నీటిని కృష్ణాకు తరలించడంలో ఈ కాల్వదే ప్రధాన భూమిక.
     
     ఈ ప్లాంటే అడ్డు..
     ఆధునీకరణ పనుల్ని చేయాలంటే వీటీపీఎస్‌కు దిగువన ఉన్న యాక్టివ్ పవర్ ప్లాంట్ (1.4 మెగావాట్లు) అడ్డు ఉందని, దాన్ని నిలిపేస్తేనే పనులను చేయడానికి సాధ్యం అవుతుందని నాడు ఇంజనీర్లు నివేదిక ఇచ్చారు. దాంతో ఈ పవర్ ప్లాంట్‌కు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జారీ చేసిన నిరభ్యంతర పత్రాన్ని (ఎన్‌వోసి)ని 2009లో వైఎస్సార్ రద్దు చేశారు. తర్వాత బుడమేరు ఆధునీకరణ పనుల్ని మొదలు పెట్టారు. అయితే ప్రభుత్వ నిర్ణయంపై సదరు ప్లాంట్ యజమాన్యం కోర్టుకు వెళ్లింది. దాంతో కోర్టు స్టే ఇచ్చింది. తర్వాత రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దీనిపై 28-06-2010 నాడు ఒక నిపుణుల కమిటీని (జీవో నెంబర్ 421) ఏర్పాటు చేశారు. ముగ్గురు ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు(ఈఎన్‌సీ)లతో పాటు పోలవరం చీఫ్ ఇంజనీర్ (సీఈ) కూడా ఉన్న క మిటీ పూర్తి అధ్యయనం చేసిన తర్వాత పవర్ ప్లాంట్‌కు అనుమతించవద్దని ప్రభుత్వానికి స్పష్టమైన సిఫారసు చేసింది. పవర్ ప్లాంట్‌కు అనుమతి ఇస్తే.. బుడమేరు ఆధునీకణ పనుల్ని చేయడానికి సాధ్యం కాదని స్పష్టం చేసింది. దాంతో అప్పటి ముఖ్యమంత్రి కె. రోశయ్య పవర్‌ప్లాంట్‌కు అనుమతిని ఇవ్వలేదు.
     
     ఈ సీఎం వచ్చాక... 
     కిరణ్‌కువూర్‌రెడ్డి సీఎం అయ్యూక ఈ ప్లాంటు యూజవూన్యం తన పైరవీలను వుువ్మురం చేసింది. ఈ ప్రభుత్వంలోనూ చంద్రబాబు హవా నడుస్తుండటం కూడా వీరికి ఉపకరించింది. వుుంపును తట్టుకునేందుకు ఈ బుడమేరుకు సమాంతరంగా మరో కాల్వను తవ్వితే సరిపోతుందనే ప్రత్యామ్నాయ పద్ధతిని ఈ ప్లాంటు యూజవూన్యం ప్రభుత్వం ముందుంచింది. ఇదే విషయాన్ని కోర్టుకు కూడా సమర్పించింది. దీనిపై ఈఎన్‌సీ స్పీకి ంగ్ ఆర్డర్ ఇవ్వాల్సిందిగా కోర్టు ఆదేశించింది. దాన్ని ఆసరాగా తీసుకున్న వుుఖ్యవుంత్రి సదరు పత్రికాధిపతి పట్ల అనుకూలంగా ఉన్న తీరుతో ఈసారి ఉన్నతాధికారుల నివేదిక ప్లాంటుకు అనుకూలంగా వూరిపోరుుంది. ప్లాంటు యూజవూన్యం సూచించిన మేరకే బుడమేరుపై పవర్ ప్లాంట్ ఉన్న ప్రాంతంలో ప్రత్యామ్నాయ కాల్వను తవ్వితే సరిపోతుందని సిఫారసు చేసింది. ఈ ప్రత్యామ్నాయ పద్ధతిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం వెంటనే పవర్ ప్లాంట్‌కు శనివారం అనుమతి జారీ (జీవో నంబర్ : 4) చేసేసింది.
     
     పోలవరం డిజైన్‌కే వూర్పు!
     పోలవరం కుడి ప్రధాన కాల్వ ద్వారా వచ్చే నీరు బుడమేరు నుంచే కృష్ణాకు రానుంది. అంటే ప్రస్తుతం ఆధునీకరణ స్థానంలో మరో కాల్వ తవ్వకాన్ని చేపట్టినందున.. ఈ ప్లాంటు కోసం పోలవరం కుడి కాల్వ డిజైన్ మార్చిన ట్టేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఒక ప్రైవేట్ పవర్ ప్లాంట్ కోసం ప్రభుత్వం ఈ స్థాయి నిర్ణయాన్ని తీసుకోవడం గమనార్హం. కాగా ప్రత్యామ్నాయ కాల్వ తవ్వకానికి సంబంధించిన గడువును మాత్రం నిర్ణయించలేదు. పవర్ ప్లాంట్‌ను వెంటనే నడుపుకోవడానికి అనుమతించిన ప్రభుత్వం, కాల్వ తవ్వకానికి సంబంధించిన గడువును మాత్రం విధించలేదు. ఈ విషయంలో సంబంధిత ఈఎన్‌సీ నిర్ణయం తీసుకుంటారని ఉత్తర్వులో పేర్కొన్నారు. ప్రభుత్వం కొత్తగా జారీచేసిన మినీ జల విద్యుత్ కేంద్ర విధానం మేరకు నెడ్‌క్యాప్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పీపీఏ) కుదుర్చుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే, ఈ ప్లాంటుకు ప్రస్తుతం కొత్త పాలసీ లేదు. ఈ నేపథ్యంలో కొత్త పాలసీ లేదు కాబట్టి, ఈ విద్యుత్‌ను మార్కెట్లో అమ్ముకుంటామనే ప్రమాదం ఉంది.
     
     నాడు చంద్రబాబు, నేడు కిరణ్!
     అప్పట్లో చంద్రబాబు నాయుుడు ప్రభుత్వ ఆధీనంలోని ఒక థర్మల్ ప్లాంటు కూలింగ్ కెనాల్(వీటీపీఎస్) దిగువన మినీ హైడల్ ప్లాంటుకు ఆమోదవుుద్ర వేయుడమే వివుర్శలపాలైంది. అంటే.. వీటీపీఎస్ నడిచినన్ని రోజులూ ఈ ప్లాంటూ నడుస్తూనే ఉంటుందన్నవూట! ఇంత పీఎల్‌ఎఫ్ అవకాశం ఉన్న ప్లాంటు(ఏడాది పొడవునా...) బహూశా ఇదేననీ ఆరోపణలూ వచ్చారుు. ప్లాంటు ఏర్పాటే వివాదాస్పదం కాగా, ఆ ప్రాంత ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రస్తుత వుుఖ్యవుంత్రి దీనికి ఎన్‌వోసీ ఇచ్చిన తీరు వుళ్లీ చర్చనీయూంశమైంది. ‘‘ప్రస్తుతం కిరణ్‌కువూర్‌రెడ్డి, చంద్రబాబునాయుుడు కువ్ముక్కు రాజకీయూల నేపథ్యంలో ఈ నిర్ణయుం ఆశ్చర్యం కలిగించడం లేదు. సీఎం కొత్త పార్టీ ఏర్పాటు వార్తలొస్తున్నారుు. తన భవిష్యత్ రాజకీయు అవసరాల కోసం సీఎం ఇలా నిర్ణరుుంచి ఉండవచ్చు. ఎల్లో క్యాంపు పత్రిక సైతం ఇటీవల సీఎంకు అనుకూలంగా వ్యవహరిస్తున్న తీరు చూస్తే... ప్లాంటుకు అనువుతించడంలోని వుతలబు ఏమిటో అర్థవువుతూనే ఉంది’’ అని కాంగ్రెస్‌కే చెందిన రాజకీయు ప్రవుుఖుడొకరు అభిప్రాయుపడ్డారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement