వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. చత్తీస్గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్వపీడన ద్రోణి ప్రభావం ఉన్నట్టు విశాఖ వాతావరణ శాఖ కేంద్రం బుధవారం వెల్లడించింది. రాబోయే 24 గంటల్లో కోస్తా, తెలంగాణ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముంది. అలాగే రాయలసీమలో పలుచోట్ల వర్షాలు పడే సూచన ఉన్నట్టు వాతావరణ విభాగం పేర్కొంది.