
సాక్షి, తూర్పుగోదావరి: తూర్పుగోదావరి ఏజెన్సీ విలీన మండలాల్లో, మారుమూల గిరిజన ప్రాంతాల్లో సోమవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పర్యటించారు. చింతూరు మండలం సీతనపల్లి గ్రామంలో కాళ్లవాపు వ్యాధితో రెండు నెలల్లో 12 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై సోమవారం అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలించాల్సిందిగా ఆదేశించారు. దీంతో మంత్రి ఆళ్ల నాని ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించారు. మరణించిన గిరిజన కుటుంబాల వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు.
(నిరూపిస్తే రాజీనామా చేస్తా: ఎంపీ సవాల్)
ఈ సందర్భంగా మంత్రి ఆళ్లనాని మాట్లాడుతూ... ‘చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిని 60 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్ది, డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. విలీన మండలాల్లో ప్రతి గిరిజన గ్రామానికి ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. కాళ్ల వాపు వ్యాధితో మరణించిన ప్రతి కుటుంబానికి తగిన నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటాం. మండంలోని సమస్యలన్నింటిని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తా’మని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఈ పర్యటనలో మంత్రి ఆళ్ల నానితో పాటు కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ధనలక్ష్మి, జక్కంపూడి రాజా, డీసీసీబీ చైర్మన్ అనంతబాబు పాల్గొన్నారు. (ఆ సమస్య పునరావృతం కాకూడదు: సీఎం జగన్)
Comments
Please login to add a commentAdd a comment