కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్ : యువత నైతిక విలువలు పాటించాలని, తద్వారా మానసిక ఆరోగ్యం కలుగుతుందని ఐసీఎస్‌ఎస్‌ఆర్ గౌరవ డెరైక్టర్, ఓయూ రిటైర్డ్ రిజిస్ట్రార్, మనో విజ్ఞానశాస్త్ర ప్రధాన అధ్యాపకురాలు ప్రొఫెసర్ బీనా అన్నారు. శుక్రవారం జిల్లా జైలులో ‘నేరాలు-సామాజిక బాధ్యత, ఆత్మహత్యలు-నివారణ’ అంశాలపై ఖైదీలతో నిర్వహించిన మానసిక వికాస కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
ఒక్క నిమిషం మనస్సును అదుపులో పెట్టుకోలేకపోతే.. విచక్షణ కోల్పోయేలా ఆవేశానికి గురిచేస్తుందన్నారు. వ్యసనాలకు దూరంగా ఉంటూ, మనస్సును అదుపులో పెట్టుకోవాలని సూచించారు. నీతి, నీజాయితీతో మెలిగినప్పుడే నైతివ విలువలు పెరుగుతాయని, తద్వారా మానసిక ఆరోగ్యం కలుగుతుందన్నారు. మరో ముఖ్య అతిథి, శాతావాహన యూనివర్శిటీ వీసీ వీరారెడ్డి మాట్లాడుతూ, తెలియక చేసిన తప్పులను సరిదిద్దుకోవడమే ఉత్తమమన్నారు. అనంతరం బీనాను సన్మానించారు. అంతకుముందు అవగాహన సదస్సులు నిర్వహించినందుకు గాను ప్రశంసపత్రం అందజేశారు. జిల్లా జైలు సూపరింటెండెంట్ గౌరి రామచంద్రం, అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్‌రెడ్డి, జైలర్ సోమయ్య, సైకాలజీ కౌన్సెలర్ మహేందర్, మెడికల్ ఆఫీసర్ మొయినొద్దిన్, డెప్యూటీ జైలర్ సుధాకర్‌రెడ్డి, జైలు సిబ్బంది, ఖైదీలు పాల్గొన్నారు.
నైతిక విలువలు పాటిస్తేనే మానసిక ఆరోగ్యం
Published Wed, Nov 6 2013 3:13 AM | Last Updated on Wed, Aug 15 2018 5:57 PM
Advertisement
Advertisement