రాష్ట్రవ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలు
హైదరాబాద్ : గడిచిన 24 గంటలలో రాష్ట్రంలోని 59 మండలాల్లో పది సెంటీమీటర్ల కంటే ఎక్కువగా వర్షపాతం నమోదు అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన వర్షపాత వివరాలు: శ్రీకాకుళం సోంపేటలో అత్యధికంగా 23.18 సెం.మీ
-
మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేటలో 20.45 సెం.మీ. వర్షపాతం
-
ప్రకాశం జిల్లా నాగులుప్పాలపాడులో 19.73 సెం.మీ. వర్షపాతం
-
ప్రకాశం జిల్లా సంతమాగులూరులో 19.15 సెం.మీ.వర్షపాతం
-
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో 18.18 సెం.మీ వర్షపాతం
-
ప్రకాశం జిల్లా సింగరాయకొండ 9 సెం.మీ. వర్షపాతం
ఇక ప్రకాశం జిల్లా ఒంగోలులో 9.75 సెం.మీ వర్షపాతం నమోదు కాగా, వర్షాలకు 283 ఇళ్లు నేలకూలాయి. 6284మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షాల కారణంగా 2.49 లక్షల హెక్టార్లలో పంట నష్టం కలిగింది. కాగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు,అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాని సూచించారు.