చట్టసభల్లో బిసిలకు 33 శాతం రిజర్వేషన్లతో పాటు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ప్రమోషన్లలో బిసిలకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం ప్రవేశపెట్టింది.
హైదరాబాద్ : చట్టసభల్లో బిసిలకు 33 శాతం రిజర్వేషన్లతో పాటు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ప్రమోషన్లలో బిసిలకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం ప్రవేశపెట్టింది. తెలుగుదేశం పార్టీకి ముందు నుంచి అండగా ఉన్న బిసిలను అన్ని విధాల ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
తీర్మానాన్ని ప్రవేశపెడుతూ మాట్లాడిన ఆయన.. కులాల వారీగా వారి కోసం చేయబోయే పనులను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ప్రమోషన్లలో బిసిలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారు. 25 శాతం బడ్జెట్‌తో బిసి సబ్ ప్లాన్ అమలు చేస్తామని సిఎం వివరించారు. కాపులను బీసీల్లోకి చేర్చే విషయంలో తాము కట్టుబడి ఉన్నామని చంద్రబాబు తెలిపారు.