సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జ నాభా 27.37 లక్షలు. జిల్లావ్యాప్తంగా 7సబ్ డివి జన్లు, 21 పోలీసు సర్కిళ్లు, 72 పోలీసుస్టేషన్లు ఉన్నాయి. వీటిలోని అన్ని విభాగాల్లో 3,825 మంది పనిచేస్తున్నారు. ఐదేళ్ల గణాంకాలు పరి శీలిస్తే సగటున ఏటా 5వేలకుపైగా కేసులు న మోదవుతున్నాయి. కేసుల పరిశోధనలో సిబ్బం ది కొరత స్పష్టంగా కనిపిస్తోంది. నమోదైన కేసు ల పరిష్కారం సగటున 50 నుంచి 60 శాతం కాగా, ఐదేళ్లలో నూటికి 39 శాతం కేసుల్లో శిక్షలు పడ్డాయి. విధుల్లో ఉన్న పోలీసుల్లో అత్యధికం గా వీవీఐపీల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ వం టి విధులకు పరిమితమవుతున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పనిచేస్తున్నది అరకొర సిబ్బందే.
నిరాశ, నిస్పృహల్లో పోలీసులు
పోలీసులు సిబ్బంది కొరత వల్ల రోజుల తరబడి విధులు నిర్వర్తించాల్సి రావడం, మానసిక ఒత్తి డి, సకాలంలో పదోన్నతులు అందక నిరాశ ని స్పృహలతో వేదనకు గురవుతున్నారు. వృత్తిపరమైన ఒత్తిడుల కారణంగా ప్రజలతో స్నేహ సం బంధాలు నెరపలేని పరిస్థితి ఉంది. శాంతి భద్రతల పరిరక్షణ కోసం 24 గంటలూ విధి నిర్వహణలో అందుబాటులో ఉండేవిధంగా పోలీసు సి బ్బంది పనిఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. కాగా, వారంలో ఒకరోజు సెలవు ఇవ్వాలనే నిబంధన బ్రిటీష్ కాలం నుంచే అమల్లో ఉంది. స్వాతంత్య్రానంతరం కానిస్టేబుల్‌కు నెలకు రూ.30 జీ తం సమయంలో కూడా వారంలో ఒకరోజు సె లవు ఇచ్చేవారు. ప్రత్యేక పరిస్థితుల్లో సెలవురో జు పనిచేస్తే ఒక రోజు జీతం అదనంగా చెల్లించేవారు. ఇప్పుడు వారంతపు సెలవులేదు. అద నంగా పనిచేసినా అదనపు వేతనము రాదు. పో లీసుశాఖలో 1.10 లక్షల మంది సిబ్బంది పనిచేస్తుండగా 75శాతం మంది క్షేత్రస్థాయిలో పనిచే సే కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లే ఉన్నారు. ప్రతి ఎనిమిదేళ్లకోసారి కనీసం ఒక పదోన్నతి పొందాల్సిన కానిస్టేబుళ్లు సర్వీసు కాలం మొత్తం అదేస్థాయిలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందే దయనీయ పరిస్థితి కూడా ఉంది.
ఉన్నతాధికారులు దృష్టిసారిస్తేనే సాధ్యం..
పోలీసుశాఖలో సంస్కరణల ద్వారా ఆధునిక పోలీసు వ్యవస్థ రూపకల్పనకు చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. బ్రిటీష్ కాలంలో 1861లో ఇండియాన్ పొలీస్ యాక్టును రూపొం దించారు. దీనిస్థానంలో కొత్త సంస్కరణల కోసం బ్రిటీష్ ప్రభుత్వం 1902లోనే ఏహెచ్‌ఎల్ ఫ్రేసర్ నాయక త్వంలో ఒక కమిటీని నియమిం చింది. ఆ కమిటీ చేసిన ప్రతిపాదనల్లో కొన్నిమాత్రమే అమలుకు నోచుకున్నాయి. స్వాతంత్య్రానంతర కాలంలో పోలీసుశాఖలో సంస్కరణల కోసం అనేక కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1977లో మాజీ గవర్నర్ ధరమ్‌వీర్ నా యకత్వంలో ఏర్పడ్డ జాతీయ పోలీస్ కమిషన్,1998లో రెబిరో, 2000 మిలిమత్, పద్మనాభ య్య, 2005లో సోలీ సొరాబ్జీ కమిటీలు పోలీసు సంస్కరణల అమలుకు అనేక అమూల్యమైన ప్రతిపాదనలు అందించాయి. 2006లో సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా కొన్ని సంస్కరణల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పోలీసుశాఖను ప్రజలకు చేరువ చేసేందుకు, సంక్షేమం, భద్రత విషయంలో సంస్కరణల అమలుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకోవాల్సి ఉండగా ఉన్నతాధికారులు స్పందిస్తేనే ఫలితం ఉండే అవకాశం ఉంది.
పోలీసులను వేధిస్తున్న వ్యాధులు..
ఆరోగ్య సమస్యలపై దృష్టిసారించిన ఉన్నతాధికారులు పోలీసు సిబ్బందికి దశలవారీగా ‘మాస్టర్ హెల్త్ చెకప్’ చేయిస్తున్నారు. ఈ వైద్య పరీక్ష ల్లో చేదునిజాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీ సు సిబ్బంది ప్రాణాలు తీస్తున్న అతి ప్రమాదక ర వ్యాధుల్లో క్యాన్సర్ అగ్రస్థానం. ఆ తర్వాత గుండెజబ్బు, మూత్రపిండాలు, కీళ్ల వ్యాధులు అధికంగా ఉన్నాయి. వీటికి తోడు ఉదరకోశం, నోరు, రక్త సంబంధిత క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. పోలీసు సిబ్బంది జీవిత భాగస్వాముల్లో గర్భకోశ, చాతి క్యాన్సర్ కేసులు పెరుగుతున్నట్లు రికార్డులు చెప్తున్నాయి. చికిత్స పొంది న సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం క్యాన్సర్ బాధితుల సంఖ్య ఏడాదికి 80 కి దాటింది. క్యాన్సర్ బాధిత పోలీసుల్లో అత్యధికులు 45 ఏళ్లలోపు వారుఉండటం ఆందోళన క లిగించే అంశం. ట్రాఫిక్‌లో పనిచేసే సిబ్బందిలో అత్యధికమంది శ్వాస సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు. అడవుల్లో ఎక్కువ రోజులు కూంబింగ్‌లో పాల్గోనే సాయుధ పోలీసులు కొన్ని సందర్భాలలో అనారోగ్యంపాలై ప్రాణా లు పోగొట్టుకుంటున్న పరిస్థితి కొన్నిసార్లు తలెత్తుతోంది.
నలిగిపోతున్న ‘నాలుగో సింహం’
Published Sat, Jan 4 2014 2:51 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM
Advertisement