- నేడు లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ పరిధిలో ఇకపై ఫైర్ ఎన్‌వోసీ, ట్రేడ్ లెసైన్స్‌ల్ని ఆన్‌లైన్‌లోనే పొందే విధంగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. పరిపాలనా విభాగంలో ఈ(ఎలక్ట్రానిక్) విధానాన్ని అమలు చేస్తున్నారు. దశల వారీగా మిగితా విభాగాలకు విస్తరించాలని కమిషనర్ జి.వీరపాండియన్ నిర్ణయించారు. ఇందులో భాగంగా ఫైర్, ట్రేడ్‌లెసైన్స్‌ల ఎన్‌ఓసీని ఆన్‌లైన్ చేశారు.
దరఖాస్తు ఇలా
ఆన్‌లైన్‌లో గాని, నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, మూడు సర్కిల్ కార్యాలయాల్లో, 13 కౌంటర్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. సెల్‌ఫోన్, ఆధార్ కార్డు నెంబర్లు పొందుపర్చాలి.ఆన్‌లైన్‌లో రిజిస్టర్ అయిన వెంటనే పాస్‌వర్డ్ వస్తోంది. అనంతరం వివరాలను నమోదు చేయాలి. బిల్డింగ్ ప్లాను, బ్యాంకు గ్యారంటీ, అండర్‌టేకిన్ లెటర్, ఫైర్‌ఫైటింగ్ ఎక్విప్‌మెంట్ వివరాలు,ప్రాపర్టీ, వాటర్, డ్రెయినేజ్ ట్యాక్స్‌లు వీఎల్‌టీ రసీదులు స్కాన్‌చేసి అప్‌లోడ్ చేయాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు అందుకున్న అధికారులు మెసేజ్, లేదా ఈ మెయిల్‌ద్వారా తెలియజేస్తారు. కమిషనర్ అప్రువల్ చేసిన వెంటనే మెసెజ్ వస్తోంది. అనంతరం కార్పొరేషన్ 103 కౌంటర్‌లో ఎన్‌ఓసీ కాపీని పొందవచ్చు, ఆన్‌లైన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకొనే అవకాశం ఉంది. ఈమేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నగరపాలక సంస్థ రీజినల్ ఫైర్ ఆఫీసర్ వెంకటాద్రి చౌదరి తెలిపారు.
ఇకపై ఎన్‌వోసీ ఆన్లైన్లో
Published Sat, May 9 2015 4:39 AM | Last Updated on Tue, May 29 2018 11:47 AM
Advertisement