అధికార పక్షానికి ఏడున్నర.. విపక్షానికి రెండున్నర
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సోమవారం చర్చకు వచ్చింది. ఈ చర్చా కార్యక్రమానికి మొత్తం 10 గంటల సమయం కేటాయించారు. అయితే.. అందులో అధికార పక్షం మొత్తానికి కలిపి ఏడున్నర గంటలు కేటాయించగా, విపక్షానికి మాత్రం కేవలం రెండున్నర గంటలు మాత్రమే కేటాయించారు.
తెలుగుదేశం పార్టీకి నాలుగు గంటలు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు మళ్లీ ప్రత్యేకంగా మూడు గంటలు, టీడీపీ మిత్రపక్షం, ప్రభుత్వంలో కూడా భాగమున్న బీజేపీకి 20 నిమిషాలు కేటాయించారు. మొత్తంగా దాదాపు ఏడున్నర గంటలు అధికార పక్షానికే సమయం కేటాయించారు. ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఈ తీర్మానం మీద మాట్లాడేందుకు రెండున్నర గంటలు మాత్రమే కేటాయించారు.