ఆ ఎనిమిది మంది రాలేదు | The eight members did not come to assembly | Sakshi
Sakshi News home page

ఆ ఎనిమిది మంది రాలేదు

Published Mon, Mar 14 2016 9:53 PM | Last Updated on Wed, Oct 17 2018 6:22 PM

ఆ ఎనిమిది మంది రాలేదు - Sakshi

ఆ ఎనిమిది మంది రాలేదు

హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ తరపున ఎన్నికై ఇటీవల టీడీపీలో చేరిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సోమవారం శాసనసభకు గైర్హాజరయ్యారు. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్, చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుపై ఉన్నఫళంగా అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చర్చకు అనుమతించిన నేపథ్యంలో ఈ ఎమ్మెల్యేలు శాసనసభకు రాక పోవడం చర్చనీయాంశమైంది.

వారు సోమవారం సభకు రాక పోయినా వారందరికీ సభకు హాజరై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేయాలని వైఎస్సార్‌సీపీ విప్ ఎన్.అమరనాథ్‌రెడ్డి విప్‌ను జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement