ఏటీఅగ్రహారం(గుంటూరు), న్యూస్‌లైన్ :పెండింగ్ కేసులపై దృష్టి సారించి వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని అర్బన్ ఎస్పీ జెట్టి గోపీనాథ్ ఆదేశించారు. అర్బన్ జిల్లా పరిధిలోని డీఎస్పీలతో తన కార్యాలయంలో శనివారం ఆయన సమావేశమయ్యారు. వరుస ఎన్నికల్లో సమస్యలు తలెత్తకుండా సమర్థంగా విధులు నిర్వర్తించారంటూ డీఎస్పీలను ఆయన అభినందించారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా కొనసాగించి సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ కేసులో నిందితులను కోర్టులో హాజరుపరిచి శిక్ష పడేలా చూడాలన్నారు. పెండింగ్‌లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్లలో నిందితులను కోర్టులో హాజరు పరిచి పెండింగ్ వారెంట్లను తగ్గించాలని సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీలు జానకీధరావత్, బి.శ్రీనివాసులు, డీఎస్పీలు గంగాధరం, పీవీ నాగరాజు, ఎం.మధుసూదనరావు, వెంకటేశ్వరరావు, తిరుప్పాల్, మెహర్‌బాబా, ఎస్పీ కార్యాలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్ కేసులు పరిష్కరించండి
Published Sun, May 25 2014 12:11 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
Advertisement