‘పుర’పోరుకు సై..
Published Tue, Aug 6 2013 12:16 AM | Last Updated on Mon, Sep 17 2018 5:32 PM
మున్సిపాలిటీ ఎన్నికల పోరుకు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సన్నద్ధమయ్యాయి. ఇప్పటికే వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియ పూరతవడంతో మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికల సందడి నెలకొంది. త్వరలో మున్సిపల్ ఎన్నికల నోటి ఫికేషన్ విడుదల చేస్తారని భావిస్తున్న ఆయా పార్టీలు అభ్యర్థుల ఎంపిక, గెలుపు అవకాశలపై కసరత్తు మొదలుపెట్టాయి. 2010 సెప్టెంబర్ 29వ తేదీతో గత పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. ఆ తర్వాత ప్రభుత్వం పురపాలక ఎన్నికలే నిర్వహించలేదు. ప్రత్యేకాధికారుల పాలనను ఆర్నెళ్లకొకసారి పొడిగిస్తూ వచ్చింది. పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించే ందుకు ప్రభుత్వం సిద్ధమవుతుండడంతో ఆశావహుల్లో సందడి మొదలైంది. వార్డుల వారీగా రిజర్వేషన్లు కేటాయిస్తూ కలెక్టర్ ఇప్పటికే ప్రభుత్వనికి పంపిన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. జనాభా ప్రాతిపది కన ఆయా వార్డుల్లో కులాలవారీగా అభ్యర్థులు పోటీ చేయాల్సి ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు రిజర్వేషన్లు ప్రకటించగానే బరిలోకి దిగేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.
8ఏళ్ల తర్వాత జరుగుతున్న ఎన్నికలు
జిల్లాలోని నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలో 40 వార్డులు, సూర్యాపేటలో 34, మిర్యాలగూడలో 36, భువనగిరిలో 30, నకిరేకల్‌లో 23, కోదాడలో 30 వార్డులకు, హుజుర్‌నగర్ నగర పంచాయతీలో 26 వార్డులు, దేవరకొండ నగర పంచాయతీకి ఎన్నికలు జరుగనున్నాయి. వీటికి సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఎట్టకేలకు ఎనిమిదేళ్ల తర్వత జరుగుతున్న పురపోరుకు ఆశావహులు రంగం సిద్ధ చేసుకుంటున్నారు. ఆయా మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా రిజర్వేషన్లను నిర్ణయించినప్పటికీ చైర్మన్ స్థానాలకు రిజర్వేషన్లు కేటాయించలేదు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల చైర్మన్ స్థానాల రిజర్వేషన్‌పై ఎటువంటి అభిప్రాయం వెలువడకపోవడంతో ఎంతోకాలంగా ఆ పదవిపై ఆశలు పెట్టుకున్నవారంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే త మ పార్టీల అధినేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మరికొద్దిరోజుల్లో ప్రభుత్వం నుంచి చైర్మన్ స్థానాల రిజరర్వేషన్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Advertisement
Advertisement